బంగారం కొనాలనుకునేవారికి చేదు వార్త. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ఒక్కసారిగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగడంతో దేశీయంగా కూడా పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ఎంత ఉందంటే?
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం మీద డిమాండ్ పెరగడంతో దేశీయంగా ధరలు పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1964.77 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మన కరెన్సీ ప్రకారం రూ. 1,62,158.52 వద్ద కొనసాగుతోంది. గ్రాము స్పాట్ గోల్డ్ ఐతే రూ. 5,213.53 వద్ద కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఈ నెలలో బంగారం ధరలు చూసుకుంటే జూన్ 1న 22 క్యారెట్ల బంగారం రూ. 55,700 ఉండగా, జూన్ 2న రూ. 300 పెరుగుదలతో 56 వేలు అయ్యింది. జూన్ 3న రూ. 700 తగ్గుదలతో రూ. 55,300కి చేరుకుంది. 4,5 తేదీల్లో స్థిరంగా ఉన్న బంగారం జూన్ 6న రూ. 300 పెరిగింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ. రూ. 55,600 వద్ద నిలిచింది.
ఇక 24 క్యారెట్ల బంగారం కూడా జూన్ 1న రూ. 60,760 ఉండగా.. 2న రూ. 340 పెరుగుదలతో 61,100కి చేరుకుంది. జూన్ 3న రూ. 770 తగ్గుదలతో రూ. 60,330కి చేరుకుంది. 4,5 తేదీల్లో స్థిరంగా ఉండగా 6న రూ. 320 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,650 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా బంగారం బాటలోనే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ వెండి 23.59 డాలర్ల వద్ద ఉంది. మన కరెన్సీ ప్రకారం రూ. 1946.62గా ఉంది. గ్లోబల్ గా సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వెండి ధర కూడా పెరిగింది. దేశీయంగా కూడా పెరుగుదల కనిపించింది. నిన్న హైదరాబాద్ లో కిలో వెండి రూ. 77,700 ఉండగా ఇవాళ రూ. 300 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 78 వేల వద్ద కొనసాగుతోంది.