భారతదేశంలో ప్రభుత్వ రంగానికి సంబంధించిన అతి పెద్ద వ్యవస్థలో తపాల ఒకటి. ఒకప్పుడు ఉత్తరాలను అందించాడనికి ఈ వ్యవస్థనులు ప్రజలు ఉపయోగించుకునే వారు. కానీ కాలం మారింది. ఈ వ్యవస్థ మారింది. కాలంతో పోటీ పడుతు ఎప్పటికప్పుడు కొత్తకొత్తగా మారుతూ వచ్చింది ఈ పోస్టాఫీస్. ప్రస్తుతం కేవలం ఉత్తరాలను అందించే సేవలే కాకుండా బ్యాంకులు అందించే దాదాపు ప్రతి సేవలు పోస్టాఫీస్ లో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులను పెంపొందించుకునేందుకు అనేక కొత్త స్కీమ్ లతో ముందుకు వచ్చింది. లాభాలు అందించే అనేక స్కీమ్ లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ పోస్టాఫీస్ కు సంబంధించిన ఓ స్కీమ్ తో అదిరే లాభలు వస్తాయి. బ్యాంక్ ఎఫ్ డీల కన్నా అధిక వడ్డీ కోసం ఆశించే వారు ఈ పోస్టాఫీస్ స్కీమ్ ను పరిశీలించొచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రతి ఒక్కరు తమ డబ్బులను దాచుకోవాలనుకుంటారు. అయితే అలా దాచుకోవాలనుకునే వారికి ప్రస్తుతం అనేక మార్గాలు , అనేక పథకాలు ఉన్నాయి. అయితే కొన్నిటిలో రిస్క్ ఉంటుంది. అలాంటి రిస్క్ ఉన్న పర్లేదు.. మాకు ఎక్కువ మొత్తంలో డబ్బులు కావలనుకునే వారుంటారు. అలాంటి వారికి పోస్టాఫీస్, బ్యాంకుల్లో పలు స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కొందరు మాత్రం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారికి కూడా పోస్టాఫీస్ లో స్కీమ్ ఉంది. అలాంటి వారు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే స్కీమ్ లో డబ్బులు దాచుకోవచ్చు. దీని వల్ల మంచి లాభం పొందొచ్చు. అయితే ఐదేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ టెన్యూర్ లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఈ స్కీమ్ ఉపయోగపడుతోంది. ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిికెట్ పథకం మెచ్యూరిటీ కాల పరిమితి ఐదేళ్లు.
దీని ద్వారా మీరు బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ల ద్వారా పొందే రాబడి కన్నా ఎక్కువ పొందవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ద్వారా స్థిరమైన రాబడి లభిస్తుంది. ఈ స్కీమ్ లో చేరితే 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. మీకు మెచ్యూరిటీ సమయంలో అసలు, వడ్జీ రెండూ కలిపి చెల్లిస్తారు. ఈ పథకం ప్రకారం.. మీరు ఐదేళ్ల టెన్యూర్ తో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే..6.8 శాతం వడ్డీ రేటు ప్రకారం..మీ మెచ్యూరిటీ సమయానికి రూ.14 లక్షలు లభిస్తాయి. అంటే ఐదేళ్లలోనే రూ.4 లక్షలు లాభం వస్తుందన్నమాట. అలానే ఐదేళ్ల కాలపరిమితికి రూ.10 లక్షలు బదులు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటి సమాయానికి రూ.7 లక్షలు దాకా వస్తాయి. అంటే మీకు రూ.2 లక్షలు లాభం వస్తుంది.
మీరు డిపాజిట్ చేసే మొత్తం బట్టి మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. సేఫ్ ఇన్వెస్ట్ మెంట్స్ కావాలనుకునే వారికి ఈ స్కీమ్ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ కింద అకౌంట్ ను ఎవరైన తెరవచ్చు. ఉమ్మడి ఖాతా సౌకర్యం కూడా ఉంది. అయితే ఈ స్కీమ్ కింద కనిష్ఠంగా రూ.1000 ఉంటుంది. గరిష్టం పరిమితి అంటూ ఏమిలేదు. అలాగే ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టే వారు ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్కీమ్ మెచ్యూరిటీ కాలం పూర్తైన తరువాతనే డబ్బులను విత్ డ్రా చేసుకోగలం. మరి… రిస్క్ లేకుండా అధిక లాభం కావాలనుకునే వారికి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతోంది.