వినోదాన్ని పంచె సినిమా రంగం అంటే అందరకి ఆసక్తే. కుటుంబంతో కలిసి నాలుగు గంటల పాటు హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేయొచ్చు అనిపించే ఏకైక రంగం.. సినిమా రంగమే. అందులోనూ.. కొత్తవయినా.. పాతవయినా.. సినిమాను థియోటర్లలో చూసినప్పుడే అసలైన మజా దొరుకుతుంది. ఎందుకు ఖర్చు దండగ అనుకొని.. మొబైల్/కంప్యూటర్ లో చూశారా! ఆ ఫీలింగ్ మిస్ అవుతారు. కాకుంటే.. రాను.. రాను.. టిక్కెట్ల రేట్లు అధికమవుతున్నాయి. ఎంతలేదన్నా.. సాధారణ థియోటర్లలో 100 నుంచి 150 వరకు ఉంటది. అదే.. మల్టీ ఫ్లెక్స్ లలో అయితే.. 300 నుంచి 500 దాకా ఉంటాయి.
వారానికి ఎంతలేదన్నా.. 5 నుంచి 6 కొత్త సినిమాలు రిలీజే అవుతుంటాయి. అన్ని చూడాలనిపించినా… ఇంత రేట్లు పెట్టి ఏం చూస్తాం రా బాబోయ్.. అని మనుసులో అనిపిస్తుంటది. అలాంటి మూవీ లవర్స్ కు కేవలం 1500 తో 30 సినిమాలు చూసే సువర్ణవకాశం ఉంది. అది కూడా మల్టీ ఫ్లెక్స్ లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అదే.. PVR మల్టీ ఫ్లెక్స్. ప్రస్తుతం దేశంలో హైదరాబాద్ సహా నాలుగు నగరాల్లోనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇంతకీ ఆఫర్ ఏంటి? ఎలా ఎన్రోల్ ఆవ్వాలన్న పూర్తి వివరాలు మీకోసం..
ప్రముఖ మల్టీ ఫ్లెక్స్ ‘PVR cinemas‘ ఈ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. PVR weekday pass పేరిట రూ.1500కే 30 సినిమాలు చూసే అవకాశం కల్పిస్తోంది. అయితే.. ఈ 30 సినిమాలు కూడా 90 రోజులలో చూడాల్సివుంటుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒకరోజులో ఒక టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాల్సిఉంటుంది. పూణే, కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్ మరియు హైదరాబాద్‌లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.