కొత్త కారు కొనాలనుకుంటున్నారా! అయితే మీకో శుభవార్త. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి పలు కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లతోపాటు కాంప్లిమెంటరీ ప్యాకేజీలు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్లు ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండనున్నాయి. మారుతి ఎస్- ప్రెస్సో, డిజైర్, ఎవో, ఇగ్నిస్, గ్రాండ్ విటారా, సియాజ్, సెలెరియో, బాలెనో, స్విఫ్ట్, ఆల్టో కే 10, ఆల్టో 800, వ్యాగన్ ఆర్ వంటి మోడళ్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి. అయితే.. ఈ ఆఫర్లు మాత్రం ఎంపిక చేసిన డీలర్ షోరూముల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఆల్టో 800 మోడల్ పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ. 15,000 చొప్పున అందిస్తుండగా, అదనంగా కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,000 వరకూ లభిస్తుంది. అలాగే.. పాపులర్ మోడల్ డిజైర్ కొనుగోలుపై రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,000 వరకు అందుబాటులో ఉంది. ఇక ఇగ్నిస్ మోడల్ పై క్యాష్ డిస్కౌంట్ రూ. 23,000 వరకూ, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,000 అందుబాటులో ఉంది.
ఇక ఎవో మోడల్‌పై ఎక్స్చేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ బోనస్ రూ. 5,000 వరకు లభిస్తుంది. సియాజ్ మోడల్ పై క్యాష్ డిస్కౌంట్ రూ. 10,000, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 25,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,000 అందుబాటులో ఉంది. గ్రాండ్ విటారాపై రూ.39 వేల వరకు కాంప్లిమెంటరీ యాక్సెస్, లక్ష కిలోమీటర్లు లేదా ఐదేండ్ల వరకు అదనపు వారంటీ ప్రయోజనాలు కల్పిస్తోంది. అలాగే.. బాలెనోలో ఎంపిక చేసిన వేరియంట్లపై ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10,000 లభిస్తుంది.
ఇక మారుతి సుజుకి ఎస్- ప్రెస్సో, ఆల్టో కే 10 మోడల్ కార్లపై క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ. 30,000, ఎక్స్చేంజ్ బోనస్ ద్వారా రూ. 15,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,000 చొప్పున అందిస్తోంది. అలాగేసెలెరియో మోడల్ పై క్యాష్ డిస్కౌంట్ రూ. 25,000, ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,000 వరకు అందుబాటులో ఉంది. మరో మోడల్ వ్యాగన్ ఆర్ మోడల్ కారుపై రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అలాగే స్విఫ్ట్ మోడల్ పై క్యాష్ డిస్కౌంట్ రూ. 15,000, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,000 వరకు పొందొచ్చు. అయితే.. ఎర్టిగా, బ్రెజా, ఎక్స్ఎల్ 6, గ్రాండ్ విటారా వంటి మోడళ్లపై డిస్కౌంట్లు లేవు.