ఇండియాలో 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన తొలి దేశీయ కంపెనీగా లావా ఇంటర్నేషనల్ రికార్డు సృష్టించింది. ‘అగ్ని’ పేరుతో లావా ఇంటర్నేషనల్ ఈ ఫోన్‌ను రూపొందిస్తోంది. దీని ఉత్పత్తి మొత్తం నోయిడాలోని తయారీ కేంద్రంలో చేస్తున్నారు. దీని ధరను కంపెనీ ప్రస్తుతం రూ.19,999గా నిర్ణయించింది. ప్రారంభ ధర కింద ముందు బుక్ చేసుకునేవారికి రూ.17,999కే ఇవ్వనున్నట్లు తమ వెబ్‌సైట్‌లో లావా ఇంటర్నేషనల్ తెలిపింది. గ్లోబల్ వైడ్ గా మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్ తో 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చిన రెండో కంపెనీ లావా.
నవంబరు 18 నుంచి ప్రత్యక్ష మార్కెట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోనూ లావా అగ్ని అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. అంతకన్నా ముందే బుక్ చేసుకోవాలంటే లావా ఈ-స్టోర్‌లో ఆ అవకాశం కల్పించారు. నవంబరు 9 నుంచి 17 వరకు ప్రీ బుకింగ్స్ కు అవకాశం కల్పించింది. అమెజాన్‌లోనైతే రూ.500 చెల్లించి ప్రీ బుక్ చేసుకోవాలి.
Capture your precious moments with 64MP Quad AI Camera, 5MP Wide Camera, 2MP Depth & 2MP Macro Camera. LIVE now:
हिंदी में देखने के लिए https://t.co/U3oWM9V5gp or in English https://t.co/U3oWM9V5gp#AGNI5G #LavaMobiles #ProudlyIndian pic.twitter.com/OrkpSJ5rRX— Lava Mobiles (@LavaMobile) November 9, 2021
లావా అగ్ని 6.78 అంగుళాల ఫుల్ హై డెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ పంచ్ హోల్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తోంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే 64 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ వైడ్ యాంగిల్, 2 ఎంపీ డెప్త్, 2 ఎంపీ మాక్రో కెమెరాలు ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ తో ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఇంక అగ్ని లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ ఓఎస్ 11తో అందుబాటులోకి వస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ సూపర్‌ఫాస్ట్ ఛార్జర్ ను అందించనున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ సిస్టమ్ ఉంటుంది.
Best in class, Made in India Superpower is here with
🔥MediaTek Dimensity 810
🔥64 MP Quad AI camera
🔥6.78” FHD+ display with 90 Hz refresh
Pre-book now for Rs.500 to save Rs.2000 on #AGNI5Ghttps://t.co/is99grgwSL
T&C Apply#ProudlyIndian #LavaMobiles pic.twitter.com/V9qWcwNp2R— Lava Mobiles (@LavaMobile) November 9, 2021
Lava is killing all the competition. Join us for the LIVE event happening right now.
हिंदी में देखने के लिए https://t.co/U3oWM9V5gp or in English https://t.co/U3oWM9V5gp#AGNI5G #LavaMobiles #ProudlyIndian pic.twitter.com/Tipxc3NtUz— Lava Mobiles (@LavaMobile) November 9, 2021