ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు చోటు దక్కించుకుంది. విమాన సేవలను అందించడంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రపంచ స్థాయి ఎయిర్‌పోర్టులతో పోటీపడి నాలుగో స్థానంలో నిలిచింది. ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియమ్ వెల్లడించిందన వివరాలు ప్రకారం.. 88.44 శాతం ఆన్-టైమ్ పర్సంటేజీతో (OTP) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లార్జ్ కేటగిరీలో సమయపాలన పాటించే విమానాశ్రయాల్లో ఒకటిగా పేరు పొందింది.
ఈ జాబితాలో జపాన్ కు చెందిన న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్ 92.95 శాతం ఆన్-టైమ్ పనితీరుతో మొదటి స్థానంలో ఉండగా, ఒసాకా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(91.11%) రెండో స్థానంలో, ఫుకుయోకా ఎయిర్‌పోర్ట్(89.23%) మూడో స్థానంలో నిలిచాయి. మొదటి మూడు స్థానాల్లో జపాన్ ఎయిర్‌పోర్టులు ఉండటం గమనార్హం. ఈ జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. తర్వాతి స్థానంలో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నిలించింది. ఇక నివేదిక ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయం మొత్తం 71 రూట్లకు, 26 విమానయాన సంస్థలకు సేవలందిస్తోంది. ఇక్కడి నుండి బయలుదేరే విమానాల సమయానికి రాకపోకల రేటు 84.41 శాతంగా ఉంది.
#Hyderabad‘s Rajiv Gandhi International Airport Ranked as the 4th Most Punctual #Airport in the World!
Based on November’s on-time performance report by Cirium (aviation analytics firm), RGIA beat all #Indian airports in the large category with an on-time performance of 88.44%.
— Travel Diary (@TravelDiary5) December 27, 2022