సొంతూరిలో ఉంటూ కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచించేవారికి ‘ఆధార్ సెంటర్ ఫ్రాంచైజీ’ చాలా మంచి నిర్ణయం. ఇందుకోసం.. మీరు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్లు, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. పెట్టుబడి పెట్ట కుండానే ప్రతి నెలా భారీగా ఆదాయం పొందొచ్చు. మరి.. ఆధార్ సెంటర్ ఫ్రాంచైజీ ఎలా పొందాలి? దరఖాస్తు ఎలా చేయాలి? వంటి వివరాలు మీకోసం..
దేశంలో నివసించే ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఒకప్పుడు ఆధార్ కార్డు అంటే.. గుర్తింపు కార్డుగానే పరిగణించేవారు.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అయ్యింది. ఈ కారణంగానే దీనికి అధిక డిమాండ్ ఉంది. మీరు ఆధార్ కార్డ్‌ని ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే.. దీని కోసం మొదట మీరు UIDAI నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. ఆపై మీకు సేవా కేంద్రాన్ని తెరవడానికి లైసెన్స్ ఇవ్వబడుతుంది. ఆపై.. మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాలి. ఇది పూర్తయ్యాక.. కామన్ సర్వీస్ సెంటర్ లో రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది.
CSC అధికారిక వెబ్‌సైట్ https://www.csc.gov.in/ ఓపెన్ చేసిన తర్వాత ‘Interested to become a CSC‘ లింక్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. CSC రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత ఆధార్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్ ఏర్పాటు చేయడానికి ఆఫీస్ గది కావాలి. సొంత గది అయినా అద్దెకు తీసుకున్నా పర్లేదు. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్, వెబ్‌క్యామ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐరిస్ స్కానర్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్, పవర్ స్టాండ్‌బై ఉండాలి. ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్ నిర్వహించేవారికి ఒక ఆధార్ కార్డుపై రూ.35 ఆదాయం లభిస్తుంది.
ఎలా దరఖాస్తు చేయాలి..?
మీరు ఆధార్ ఫ్రాంచైజీ లైసెన్స్ పొందడానికి.. ముందుగా NSEIT అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ Create New Userపై క్లిక్ చేయాలి. అందులో క్లిక్ చేసిన తర్వాత కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు షేర్ కోడ్‌ను నమోదు చేయమని అడుగుతారు. షేర్ కోడ్ కోసం.. మీరు ఆఫ్‌లైన్ ఈ-ఆధార్‌కి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్‌లోడ్ చేసిన తర్వాత.. మీరు xml ఫైల్, షేర్ కోడ్ రెండింటినీ డౌన్‌లోడ్ చేస్తారు.
దరఖాస్తు చేస్తున్నప్పుడు స్క్రీన్‌పై ఒక ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో అడిగిన మొత్తం సమాచారాన్ని పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. దీంతో యూజర్ ID, పాస్వర్డ్ మీ ఫోన్, ఈ-మెయిల్ కు వస్తాయి. వాటిని ఉపయోగించి ఆధార్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ పోర్టల్‌కి సులభంగా లాగిన్ కావచ్చు. ఆ తర్వాత మీకు కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంది.. దానిపై క్లిక్ చేయండి. తరువాత ఓపెన్ ఆయిల్ ఫారమ్ లో అడిగిన సమాచారాన్ని అందించాలి. వివరాలు చెక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తరువాత వినియోగదారులకు మీరు సేవలను అందించటం ప్రారంభించవచ్చు.
ఆధార్ సెంటర్ ఫ్రాంచైజీ కోసం అప్లై చేయకులనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: IRCTC: ఈ బిజినెస్ ఎంచుకుంటే.. రైల్వే నుంచి నెలకు రూ.80 వేల ఆదాయం పక్కా.. !
ఇదీ చదవండి: Business Idea: అదిరే బిజినెస్ ఐడియా.. తక్కువ పెట్టుబడి – ఎక్కువ లాభం!