భారత దేశంలో బిలియనీర్లకు తక్కువేమి లేదు. వారు కొనుగోలు చేసే వస్తువులు కోట్లలో ఉంటాయి. వారి జీవితం లగ్జరీగా గడుపుతారు. ఏదైనా వస్తువు కోట్లలో కొన్నారంటే అంబానీనే అనుకుంటాం. కానీ అలాంటి కోవకు చెందిన వ్యక్తే రవి పిళ్లై. ఈయన దుబాయ్ లో నివాసముంటున్నారు.
మన దేశంలో చాలామంది కోటీశ్వరులు ఉన్నప్పటికీ మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అంబానీ, అదానీ పేర్లు. ఎందుకంటే వారు చేసే వ్యాపార సంబంధమైన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. భారత దేశంలో బిలియనీర్లకు తక్కువేమి లేదు. వారు కొనుగోలు చేసే వస్తువులు కోట్లలో ఉంటాయి. వారి జీవితం లగ్జరీగా గడుపుతారు. ఏదైనా వస్తువు కోట్లలో కొన్నారంటే అంబానీనే అనుకుంటాం. కానీ అలాంటి కోవకు చెందిన వ్యక్తే రవి పిళ్లై. ఈయన దుబాయ్ లో నివాసముంటున్నారు. ఆయనకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
ప్రముఖ భారతీయ బిలియనీర్లలో రవి పిళ్లై ఒకరు. ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో నివాసమున్నారు. ఆయన రూ.100 కోట్లు పెట్టి ఎయిర్ బస్ హెలికాప్టర్ కొనుగోలు చేశారు. రూ. 100కోట్లతో హెలికాప్టర్ కొన్న తొలి ఇండియన్‌గా రికార్డు క్రియేట్ చేశారు. రవి పిళ్లై స్వస్థలం కేరళలోని కొల్లాం. ఇతని తండ్రి సాధారణ రైతు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాకు ఓర్చుకుని తను ఉన్నత స్థానాన్ని పొందిన రవి పిళ్లై ప్రస్తుతం ఆర్‌పీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నారు. రవి పిళ్లై 1953, సెప్టెంబర్ 2లో జన్మించారు. కొచ్చి విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. న్యూయార్క్‌లోని ఎక్సెల్సియర్ కాలేజీలో తత్వశాస్త్రం చదివారు. అందులో డాక్టరేట్ పట్టా స్వీకరించారు. లక్ష రూపాయలు అప్పు తీసుకుని 1978లో రవి పిళ్లై సౌదీ అరేబియాలో తన నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించారు. అతని నిర్మాన సంస్థ పేరు నాసర్ ఎస్.అల్ హజ్రీ కార్పొరేషన్. అంచెలంచెలుగా కష్టపడి తనకంటూ ఓ ప్రత్యేక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ప్రస్తుతం ఈయన వ్యక్తిగత సంపద 2.8 బిలియన్ డాలర్లు ఉన్నట్లు అంచనా.
2022 జూన్‌లో అత్యాధునిక ఎయిర్‌బస్ H145 హెలికాప్టర్‌ను రూ. 100 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఈ హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు, ఏడుగురు ప్యాసెంజర్స్ ప్రయాణించవచ్చు.
ఈ హెలీకాప్టర్‌కు సముద్ర మట్టానికి 20 వేల అడుగుట ఎత్తు నుంచి ల్యాండింగ్, లాంచింగ్ చేయగల సామర్థ్యం ఉంది. మొదటిసారిగా రూ. 100 కోట్లతో ఎయిర్ బస్ హెలికాప్టర్ కొన్న తొలి భారతీయునిగా రికార్డ్ సృష్టించిన రవి పిళ్లై సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.