SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Central Govt Gives Money To Couple Who Marry Sc Person As Inter Caste Marriages

ఇలా పెళ్లి చేసుకుంటే రూ.2.50 లక్షలు వస్తాయి.. ఈ పథకం గురించి తెలుసా!

    Published Date - Wed - 30 November 22
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇలా పెళ్లి చేసుకుంటే రూ.2.50 లక్షలు వస్తాయి.. ఈ పథకం గురించి తెలుసా!

ప్రస్తుత కాలంలో పెళ్లి తంతు ఎంత భారంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక అని చెప్పి.. అప్పు చేసి మరి ఆడంబరంగా వివాహం తంతు నిర్వహిస్తున్నారు. మధ్యతరగతి, ధనవంతుల ఇళ్లల్లో అయితే ఖర్చు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి పేదల సంగతి ఏంటి. అందునా ఆడపిల్ల వివాహం అంటే కట్నకానుకల పేరుతో బోలేడు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు నిరుపేద యువతలకు వివాహ సందర్భంగా ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమల్లో ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా వివాహ సందర్భంగా ఆర్థిక సాయం చేసే పథకాన్ని ఒకదాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఏకంగా 2.50 లక్షల రూపాయలు అందిస్తోంది. ఇంతకు ఆ పథకం పేరేంటి.. ఎవరికి వర్తిస్తుంది.. ఎలా అప్లై చేసుకోవాలి వంటి పూర్తి వివరాలు..

నాగరిక సమాజంలో బతుకుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికి.. నేటికి కూడా మన సమాజంలో కులాల పేరుతో కుమ్ములాడుకోవడం మాత్రం తగ్గలేదు. పైగా కొన్నేళ్ల నుంచి ఈ భావన మరింత ముదిరినట్లు కొన్ని సంఘటనలు చూస్తే అర్థం అవుతుంది. నేటికి కూడా మన సమాజంలో కులాంతర వివాహాలను అంగీకరించలేకపోతున్నాం. పెద్దలను ఎదిరించి ఇలా కులాంతర వివాహాలు చేసుకుంటే.. ఏకంగా కన్నప్రేమను సైతం మర్చిపోయి బిడ్డలను కడతేరుస్తున్న తల్లిదండ్రులను చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సామాజిక అసమానతలు రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న పథకాన్ని తీసుకువచ్చింది.

marraige

ఈ పథకం కింద కులాంతర వివాహాలను ప్రోత్సాహించడం 2.50 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ పథకమే ‘డాక్ట‌ర్ అంబేద్కర్ స్కీమ్ ఫ‌ర్ సోష‌ల్ ఇంటిగ్రేష‌న్ త్రూ ఇంట‌ర్ క్యాస్ట్ మేరేజెస్’. ద‌ళితులు ఇతర కులాలకు చెందిన వారిని వివాహం చేసుకునేలా వారిని ప్రోత్స‌హించడం కోసం ఈ ప‌థ‌క‌ం తీసుకువచ్చారు. 2013లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. ఇందుకోసం అంబేద్కర్‌ ఫౌండేషన్‌ను స్థాపించి.. దీని ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ప‌థ‌కం వివ‌రాలు ఏమిటి.. దీనికి అర్హులెవరు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.. ఈ ప‌థ‌కం ద్వారా ఆర్థిక సహాయం అందుకోవడం ఎలా.. నియమ నిబంధనలేమిటి వంటి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు..

అర్హులెవరంటే..

  • 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు నిండిన యువ‌తీయువ‌కులు
  • కులాంత‌ర వివాహం చేసుకున్నవారు ఈ పథకానికి అర్హులు.
  • వివాహ‌మైన జంట‌ల్లోని వ‌ధూవ‌రుల్లో ఒకరు త‌ప్ప‌నిస‌రిగా ద‌ళితులై ఉండాలి.
  • అంతేకాక ఈ కులాంత‌ర వివాహం హిందూ వివాహ చ‌ట్టం ప్రకారం రిజిస్టరై ఉండాలి.
  • ఈ కులాంతర వివాహాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించి ఉండాలి.
  • ఈ కులాంత‌ర వివాహం చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌ద‌న‌ని తెలియ‌జేస్తూ వ‌ధూవ‌రులిద్ద‌రూ ఒక అఫిడ‌విట్ స‌మ‌ర్పించాలి
  • మొదటిసారి వివాహం చేసుకుంటున్న వారికి మాత్రమే ఈ పథకం కింద ఆర్థిక సాయం అందుతుంది.
  • పెళ్లి చేసుకున్న జంటలో దళిత సామాజిక వర్గానికి చెందిన వారు తప్పనిసరిగా తమ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి.
  • దళిత సామాజిక వర్గానికి చెందని భాగస్వామి కూడా తన కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
  • అలానే ఈ పథకానికి అప్లై చేసుకునే కులాంతర వివాహం చేసుకున్న జంట తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను సమర్పించాలి.

ఎలా ధ‌ర‌ఖాస్తు చేసుకోవాలి

  • ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం పొందాలంటే.. కులాంతర వివాహం చేసుకున్న వారు నిబందనల ప్రకారం తమ దరఖాస్తును తమ ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యుడు/ శాసనసభ్యుడు/ జిల్లా కలెక్టర్ ద్వారా సిఫారసు చేయించుకోవాలి.
  • పైన పేర్కొన్న వ్యక్తుల ద్వారా మాత్రమే దరఖాస్తు అంబేద్కర్ ఫౌండేషన్‌కు చేరాలి.
  • లేదంటే వారి సిఫారసు లేఖ అప్లికేషన్‌కు జత చేసి పంపించాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలా

డాక్ట‌ర్ అంబేద్క‌ర్ ఫౌండేష‌న్ వెబ్‌సైట్‌లో ఈ ద‌ర‌ఖాస్తు ఫారం ల‌భిస్తుంది. http://ambedkarfoundation.nic.in/icms.html ద్వారా దరఖాస్తు నమూనా పొందవచ్చు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన వారు https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login పెళ్లికానుక ప‌థ‌కం పోర్ట‌ల్ ద్వారా ఈ ప‌థ‌కానికి న‌మోదు చేసుకోవచ్చు.

తెలంగాణ‌ రాష్ట్రానికి చెందిన వారు https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైటులోకి వెళ్లి అందులో Incentive/ Financial Assistance Name : Intercaste Marriage Incentive Award Registration/ Application Print/Status క్లిక్ చేసి దాని ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

కులాంతర వివాహం చేసుకున్న నాటి నుంచి ఏడాది లోపు ఆ దంపతులు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే 2.50 లక్షల ఆర్థిక సాయం పొందడానికి దరఖాస్తు చేసుకోవాలి.

ఆదాయ పరిమితి ఎంత ఉండాలంటే

  • మొదట్లో ఇలా కులాంతర వివాహం చేసుకుంటున్న జంటల్లో.. దళిత భాగస్వామి కుటుంబ ఆదాయ పరిమితి రూ.5 లక్షల లోపు ఉండాలని కేంద్రం నిర్ణయించింది.
  • కానీ తరువాత కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించింది.
  • కులాంతర వివాహం చేసుకునే దళితులకు ఎలాంటి ఆదాయ పరిమితి లేకుండానే ఈ పథకం వర్తించేలా ప్రస్తుతం నిబంధనలు మార్చారు.

marraige

ఈ పథకం ద్వారా లభించే మొత్తాన్ని దంపతుల పేరిట ఉండే జాయింట్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో ఈ మొత్తాన్ని జమ చేస్తారు. అయితే ఈ మొత్తాన్ని ఎన్ని విడతలలో ఇవ్వాలనేది ఫౌండేషన్ విచక్షణాధికారాలను బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఒకేసారి 2.50 లక్షల రూపాయలను ఆ దంపతుల జాయింట్‌ బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తారు.. కొన్ని సందర్భాలలో మొదట 1.50 లక్షల రూపాయలను చెల్లించి మిగతాది ఆ జంట పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. 3 సంవత్సరాల పాటు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్టును నిర్వహించి మూడేళ్ల తరువాత వడ్డీ సహా ఆ డబ్బను ఆ దంపతులకు చెల్లిస్తారు.

దరఖాస్తులు అందాల్సిన చిరునామా

కులాంతర వివాహం చేసుకున్న వారు పెళ్లి కానుక కోసం తమ దరఖాస్తులను ఆయా రాష్ట్రాల జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టరు/ డిప్యూటీ కమిషనరు/సంక్షేమ శాఖ ద్వారా సిఫారసు చేయించుకుని వారి ద్వారా ఆ దరఖాస్తులను ఈ కింద చిరునామాకు చేరేలా చూసుకోవాలి.

డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్
జీవన్ ప్రకాష్ బిల్డింగ్
9వ అంతస్థు
25, కె.జి.మార్గ్
న్యూదిల్లీ – 110001

మరిన్ని వివరాలకు Consultant.daf@govcontractor.in011-26180211, 8588038789 ఫోన్ నంబర్లను కానీ సంప్రదించొచ్చు.

కులాంత‌ర వివాహాల‌ను ప్రోత్స‌హించ‌డానికి కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ మొత్తంలో ఆర్థిక సాయం అంద‌జేస్తున్నా.. ఇప్ప‌టికీ దీని గురించి చాలామందికి అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, కులాల క‌ట్టుబాట్లు మీర‌లేక‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల ఈ ప‌థ‌కాన్ని ఉప‌యోగించుకుంటున్న వారి సంఖ్య తక్కువగానే ఉందని అధికారులు తెలుపుతున్నారు. .

Tags :

  • BR Ambedkar
  • Central Governmnet
  • Financial assistance
  • Inter Caste Marriage
  • Scheduled Caste
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ గ్రామంలో 17 కుటుంబాలను వెలేసిన అగ్ర కుల పెద్దలు! ఎందుకంటే..?

ఆ గ్రామంలో 17 కుటుంబాలను వెలేసిన అగ్ర కుల పెద్దలు! ఎందుకంటే..?

  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జనసేనాని పవన్‌.. హలీమా కుటుంబంలో ఆనందం!

    ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జనసేనాని పవన్‌.. హలీమా కుటుంబంలో ఆనందం!

  • ఆ హీరోని నమ్మి మోసపోయిన రమాప్రభ.. సాయం కోసం రజనీ ఇంటికి వెళ్తే..!

    ఆ హీరోని నమ్మి మోసపోయిన రమాప్రభ.. సాయం కోసం రజనీ ఇంటికి వెళ్తే..!

  • మరోసారి పెద్ద మనసు చాటుకున్న మహేష్‌.. చిన్నారి వైద్యానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం!

    మరోసారి పెద్ద మనసు చాటుకున్న మహేష్‌.. చిన్నారి వైద్యానికి రూ.5 లక్షల ఆర్...

  • జగనన్నా నా బిడ్డను కాపాడంటూ మహిళ అభ్యర్థన.. స్పాట్‌లోనే సాయం చేసిన జగన్‌!

    జగనన్నా నా బిడ్డను కాపాడంటూ మహిళ అభ్యర్థన.. స్పాట్‌లోనే సాయం చేసిన జగన్‌!

Web Stories

మరిన్ని...

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..
vs-icon

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
vs-icon

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

తాజా వార్తలు

  • 15 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా..!

  • రథసప్తమి పూజ ఇలా చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి..

  • ప్రధాని మోదీ కాన్వాయ్ లో రేంజ్ రోవర్ సెంటినెల్ కారు.. ప్రత్యేకతలివే!

  • బ్రేకింగ్: సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం..!

  • బ్లూ కలర్‌ లో తారకరత్న శరీరం.. కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్!

  • సంచలనంగా మారిన రమ్య రఘుపతి ఆడియో కాల్ లీక్..

  • వీడియో: వాషింగ్ట‌న్ సుంద‌ర్ సూపర్ క్యాచ్.. అమాంతం గాల్లోకి ఎగిరి..

Most viewed

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్‌ కామరాజు.. వైరలవుతోన్న ట్వీట్‌!

  • కార్లోనే ఆ పని చేయాల్సి వచ్చింది! షాకింగ్ విషయాలు వెల్లడించిన రకుల్ ప్రీత్ సింగ్!

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam