జీవనశైలి మారడం మాత్రమే కాదు.. జీవన ప్రమాణాలు, ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి. ఇంట్లో ఒక్కరు మాత్రమే సంపాదిస్తే కుటుంబం నడిచే పరిస్థితి లేదు. అలాగని అందరూ బయటకు వెళ్లి ఉద్యోగాలు చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. అలాగే సిటీలో అయితే ఏదొక ఉద్యోగం చేసుకుని బతికేయచ్చు. కానీ, పల్లెటూర్లలో అయితే అలా కూడా కుదరకపోవచ్చు. కానీ, పల్లెటూర్లు, సిటీ అవుట్స్కట్స్ లో ఉండే వారికే ఎక్కువగా సంపాదించుకునే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు స్టార్టప్ నిపుణులు, బిజినెస్ సలహాదారులు. ముఖ్యంగా ఆడవాళ్లు నడుం బిగిస్తే నెలకు వేలల్లో సంపాదన పొందవచ్చని చెబుతున్నారు. చిన్నగా ప్రారంభించుకుని నిదానంగా పెద్ద వ్యాపారంగా కూడా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు.
అయితే అందుకు ఏం చేయాలి? ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలి అనే దానిపై సలహాలు కూడా ఇస్తున్నారు. వాటిలో ముఖ్యంగా.. విదేశీ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వ్యాపారం ప్రారంభిస్తే బావుంటుందని చెబుతున్నారు. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఈ వ్యాపారం మరింత సులభం. విషయం ఏంటంటే.. ఇప్పుడు ప్రతి ఊరిలో దాదాపు చాలామంది విదేశాల్లో ఉంటున్నారు. గతంలో అయితే తల్లిదండ్రులు పిల్లల కోసం పచ్చల్ళు, పొడులు, కావాల్సిన పదార్థాలను పంపేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తల్లిదండ్రులకు తీరిక లేకపోవడం, వారికి వయసు పెరిగిపోవడం వల్ల అలాంటి పనులను మానుకున్నారు. కానీ, విదేశాల్లో ఉండే వారి అవసరాలు మారవు కదా? ఆ అవసరాన్నే అవకాశంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా మామిడి కాయ గుజ్జు, చింతపండు గుజ్జు, తాటిపండు గుజ్జులకు డిమాండ్ బాగా ఉంటుంది. అయితే వీటిని తయారు చేయడం కొంచం పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు అలాంటి పనులను మానుకున్నారు. కానీ, ఒక నలుగురు ఆడవాళ్లు కలిసి సీజనల్ పండ్లను సేకరించి వాటిని క్లీన్ చేసి పల్ప్‌గా తయారు చేసుకోవాలి. వాటిని బాటిల్స్ లో పోసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని ఐస్ అయ్యేలా చేయాలి. తర్వాత వాటిని అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. అయితే అవన్నీ ఎవరు అడుగుతారు? ఎక్కడ అమ్మాలి? అనే అనుమానాలు వస్తూనే ఉంటాయి. అయితే మీరు ఒక బ్రాండ్‌ని స్టార్ట్ చేయాలి. మీ వస్తువలకు బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేసుకోవాలి. ముందుగా బంధువులు, ఊరి వాళ్లకు మీ ఉత్పత్తులను పరిచయం చేయాలి.
ఆ తర్వాత మీ వస్తువులకు మంచి పబ్లిసిటీ వస్తుంది. మౌత్ టాక్‌తోనే మీరు తయారు చేసే ప్రొడక్టులకు మంచి పేరు వస్తుంది. విదేశాల్లో ఉండేవారికి డబ్బు ముఖ్యం కాదు.. క్వాలిటీ మాత్రమే ముఖ్యం. కాబట్టి మంచి క్వాలిటీతో ఆర్గానిక్ ప్రాడక్టులను తయారు చేసుకోవాలి. ఆర్గానిక్ ఉత్పత్తులు అని బాగా జనాల్లోకి తీసుకెళ్లాలి. ఆ తర్వాత డిమాండ్‌ని బట్టి పచ్చళ్లు, పప్పుల పొడులు, మసాలాలను కూడా ప్రారంభించవచ్చు. అలా చిన్నగా మీ బిజినెస్‌ని పెంపొందించుకోవచ్చు. అయితే పనులు మొత్తం ఒకళ్లే చేసుకోకుండా, పెట్టుబడి ఒకరే పెట్టకుండా.. ఒక సహకార సంఘంగా ఏర్పడితే ఇంకా మంచి లాభాలు ఉంటాయి. అందరూ కలిసి పెట్టుబడి పెట్టడం, కలిసే పనులు చేసుకోవడం వల్ల ఇంట్లో ఉంటూనే నెలకు లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చు.