ఫోన్లు విషయానికి వస్తే ఐఫోన్ అంటే అందరికీ మక్కువే. కానీ, దాని ధర ఎక్కువ కాబట్టి అందరూ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తారు. ఆపిల్ ఐఫోన్ లేటెస్ట్ ఫోన్ కొనాలంటే దాదాపు రూ.1.30 లక్షలు ఖర్చు చేయాలి. సాధారణ మధ్యతరగతి వ్యక్తికి ఆ ఫోన్ కలగానే మిగిలిపోతుంది. ఒక్క ఐఫోన్ మాత్రమే కాదు ఆపిల్ కంపెనీకి సంబంధించిన ఏ ప్రొడక్టు కొనాలన్నా అందని ద్రాక్ష అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆపిల్ కంపెనీ కొత్త ప్లాన్ ను పరిచయం చేయబోతోంది. అదే అద్దెకు ఐఫోన్. అవును మీరు చదివింది కరెక్టే.. ఐఫోన్ సహా అన్ని ఆపిల్ ప్రొడక్టులను అద్దెకు ఇవ్వాలనే యోచనలో ఉన్నారు.
ఇదీ చదవండి: క్రికెట్ అభిమానులను సర్ప్రైజ్ చేసిన జియో..!
ప్రస్తుతం సాఫ్ట్ వేర్ పై సబ్ స్క్రిప్షన్ సర్వీసు అందిస్తున్న ఆపిల్.. త్వరలో హార్డ్ వేర్ పై కూడా సబ్ స్క్రిప్షన్ అందించే ఆలోచన చేస్తోంది. అంటే నెలానెలా అద్దె చెల్లించి ఆపిల్ ప్రొడక్టులను యూజర్లు వాడుకోవచ్చు. అయితే వాటితోపాటు కాంబోలో కొన్ని సాఫ్ట్ వేర్లు కూడా తీసుకోవాలనే షరతు పెట్టే అవకాశం ఉంది. అయితే ఆపిల్ కంపెనీ అసలు ఆ ఆలోచన ఎందుకు చేస్తున్నట్లు అనే అనుమానం కలగమానదు. అందుకు కారణాలను కూడా చెబుతోంది. ఐఫోన్లు సహా ఆపిల్ ప్రొడక్టులు అధిక ధరలతోనే ఉంటాయి. అందరూ అంత ఖర్చు చేయలేకపోవచ్చు. కానీ, వారికి ఐఫోన్ వాడాలని ఆశ ఉంటుంది. అలాంటి వారికి తమ ప్రొడక్టులు దగ్గరవుతాయి.. ఐఫోన్ వాడాలనే వారి కల కూడా తీరుతుందని భావిస్తున్నారు. ఈ కాన్సపెట్ లో మీరు ఐఫోన్ ఎన్నిరోజులైనా అద్దె చెల్లిస్తూ వాడుకోవచ్చు. మీరు వద్దనుకున్నప్పుడు తిరిగి ఇచ్చేయచ్చు. ఈ సదుపాయం చాలా మందిని ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.అయితే ఇది ఆపిల్ ఫోన్ కొనలేని వారికోసమే కాదు.. ఇప్పటికే ఐఫోన్ వాడుతున్న వారికి కూడా ఇది ఉపయుక్తంగా ఉండబోతోంది. ఎందుకంటే ఆపిల్ ప్రతిసారి కొత్త మోడల్, వర్షన్ తెస్తూనే ఉంటుంది. ప్రతిసారి అప్ డేటెడ్ ఐఫోన్ కొనలేకపోవచ్చు. అలాంటి వారు కూడా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. అయితే హార్డ్ వేర్ ప్రొడక్ట్ తీసుకుంటే సాఫ్ట్ వేర్ కూడా తీసుకోవాలనే నిబంధన పెడితే.. ఆ కంపెనీకి భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరి, ఆపిల్ కంపెనీ చేస్తున్న అద్దెకు ఐఫోన్ కాన్సెప్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.