దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఉదయం 11:30 గంటల సమయంలో ఈ ఇబ్బందులు తలెత్తినట్లు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఎయిర్‌టెల్.. సేవల్ని పునరుద్ధరించినట్టు ప్రకటించింది. కేవలం 10 నిమిషాల్లో సేవల్ని పునరుద్ధరించినట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. కలిగిన అసౌకర్యానికి వినియోగదారులకు క్షమాపణలు కోరింది.
Our internet services had a brief disruption and we deeply regret the inconvenience this may have caused you. Everything is back as normal now, as our teams keep working to deliver a seamless experience to our customers.
— airtel India (@airtelindia) February 11, 2022
దేశంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ నెట్ వర్క్ సేవలు కొన్ని నిమిషాలపాటు నిలిచిపోయాయి. అనేకమంది ఎయిర్‌టెల్ యూజర్లు ట్విట్టర్‌లో కంప్లైంట్స్ చేస్తూ.. తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాల్స్ చేయలేకపోతున్నామని, కాల్స్ రిసీవ్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ కూడా ఉపయోగించలేకపోతున్నామని యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. మీమ్స్ రూపంలో వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. దేశంలోని ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబయి, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్, జైపుర్, అహ్మదాబాద్ సహా చాలా ప్రాంతాల్లో సేవలు కొద్దిసేపు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మొబైల్ ఇంటర్నెట్ తో పాటు ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు కూడా సమస్యలు ఎదుర్కున్నారు.
Airtel faces massive service outage across India. #AirtelDown
This is the outage map as per Downdetector.More details soon… pic.twitter.com/2Wcelle6qH
— News18 Tech (@News18Tech) February 11, 2022
#AirtelDown
Neither mobile internet working nor broadband connection.
Please do something @airtelindia
Airtel apps also not opening. pic.twitter.com/Ued0iX0PDz— Hardik Prakash (@htyagi9650) February 11, 2022
Airtel Network Down In Some Areas!#AirtelDown#Airtel pic.twitter.com/zhj0P7BLnh
— Patel Meet (@mn_google) February 11, 2022