ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ఇటీవల ఓటీటీలో మొదలైంది. ఇప్పటికే హిందీలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఆ కారణంగా ఇప్పుడు తెలుగులో కూడా ఓటిటి సీజన్ ప్రారంభించనున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇక బిగ్ బాస్ ఓటిటిలో పాల్గొనబోయే సెలబ్రిటీలకు సంబంధించి కొందరి పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ ఓటిటి లిస్టులోకి మరో కంటెస్టెంట్ పేరు చేరినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం బిగ్ బాస్ ఓటిటిలోకి రాబోయే సెలబ్రెటీలు ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ గత సీజన్లలో పాల్గొన్న కొంతమంది సెలబ్రెటీలు కూడా ఈసారి ఓటీటీలో కనిపించే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. బిగ్ బాస్ ద్వారా వచ్చే క్రేజ్ కోసం కొందరు స్వయంగా బిగ్ బాస్ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక త్వరలో మొదలుకానున్న ఓటిటి సీజన్ లో.. సీజన్ 2 కంటెస్టెంట్ తేజస్వి మడివాడ మరోసారి పాల్గొనబోతున్నట్లు సమాచారం. బిగ్ బాస్ టీమ్ షోలో గ్లామర్ ట్రీట్ కోసం తేజస్విని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నాయి టీవీవర్గాలు. తేజస్వి ఇదివరకు కూడా బిగ్ బాస్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అలాగని ఎక్కువ రోజులు హౌజ్ లో కూడా కొనసాగలేదు. మరి ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ తో ఎంట్రీ ఇస్తే గనక ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం తేజస్వి సినీ కెరీర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక తేజస్వి మడివాడ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.