రియాలిటీ షో బిగ్ బాస్.. నాన్ స్టాప్ ఓటీటీలో మొదటివారం ఎలిమినేషన్ జరిగిపోయింది. ఈ క్రమంలో సీనియర్ కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చింది. అయితే.. ఫస్ట్ వీక్ లోనే సీనియర్స్ 5, జూనియర్స్ 2 ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు. జూనియర్స్ లో ఉన్నటువంటి ఆర్జే చైతు, మిత్రాశర్మ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అందరికంటే ముందు ముమైత్ ఎలిమినేట్ అవ్వడం గమనార్హం.
అసలు బిగ్ బాస్ ఓటిటిలో ముమైత్ తో పాటు సరయు, మిత్రాశర్మ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. కానీ మొత్తానికి బిగ్ బాస్ నుండి ముమైత్ ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసింది. అయితే.. ఎక్సపెక్ట్ చేసినవారు ఎలిమినేట్ కాలేదేంటా అని అంతా షాకయ్యారు. మరి అనూహ్యంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏమైయుంటాయని ఆమె ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు.
ముమైత్ ఎలిమినేట్ కి కారణాలు ఇలా వినిపిస్తున్నాయి. మొదటగా ముమైత్ ప్రాబ్లెమ్.. వచ్చీ రాని తెలుగు. తెలుగులో మాట్లాడేందుకు ఎన్నో తంటాలు పడింది. ఆమె చెప్పాలనుకున్న విషయం కూడా సరిగ్గా చెప్పలేకపోవడం మొదటి కారణం. రెండోది ఆర్జే చైతూతో వివాదం. హౌస్ లో అతని చేసిన కామెంట్స్ భరించలేకపోయింది. కంటెస్టెంట్ హమీదాతో హద్దుమీరిన వెటకారం.
మరోవైపు ఆమె నుండి ఆశించినంత పెర్ఫామెన్స్ లేకపోవడం ఓ కారణం. అందుకే ప్రేక్షకులు కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపించలేదని.. చివరికి ఎలిమినేట్ అయిందని చెబుతున్నారు. ఇక మొదటివారమే సీనియర్ ఎలిమినేట్ అయ్యేసరికి మిగతా సీనియర్స్ కూడా జాగ్రత్త పడుతున్నారు. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో ముమైత్ కి పడనివాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా యాంకర్ రవితో చెప్పుకొచ్చింది.
హౌస్ లో తనకు ఫేవర్ గా ఉన్నవాళ్ళ సంగతి పక్కనపెడితే.. కంటెస్టెంట్స్ శ్రీరాపాక, ఆర్జే చైతు, సరయు, బిందు మాధవి ఇలా లిస్టు అంతా సింబాలిక్ గా తెలిపింది. ఆర్జే చైతు ఫోటో చూపించగానే.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఇతనే అనేసింది. అలాగే వచ్చేవారం ఎలిమినేట్ అయ్యేది కూడా అతనే అంటూ చెప్పేసింది. ముమైత్ మాటలకు బిగ్ బాస్ ఫాన్స్ షాకవుతున్నారు. ప్రస్తుతం ఆమె యాంకర్ రవితో మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ముమైత్ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఇక నామినేషన్స్ అప్పుడు తమ పవర్ ని చూపిస్తారు. నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత దీన్ని టెలివిజన్ లో కూడా ప్రసారం చేయాలని బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తోంది. మొత్తానికి అదీ మేటర్.