బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేం. గొడవలు, లవ్వలు, అరుచుకోవడం, తిట్టుకోవడం అనేవి.. బిగ్ బాస్ హౌసులో పర్మినెంట్ కావు. ఎందుకంటే మొన్నమొన్నటి వరకు చక్కగానే ఉన్నారు అనుకున్న కంటెస్టెంట్స్ కాస్త.. సోమవారం వచ్చేసరికి సడన్ గా గొడవపడతారు. ఆ తర్వాత రోజే మళ్లీ వారిద్దరూ కలిసిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక తెలుగు బిగ్ బాస్ 6.. చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలోనే టికెట్ టూ ఫినాలే టాస్క్ పెట్టారు. దీనిలో భాగంగా శ్రీహాన్-ఇనయా మధ్య జరిగిన ఓ ఇన్సిడెంట్.. నెటిజన్లని అయోమయంలో పడేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గత సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ ఏమంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. దానికి రేటింగ్సే ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కంటెస్టెంట్స్ చాలావరకు ఎంటర్ టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్ ఆర్గనైజర్స్ కూడా అందుకు తగ్గట్లే ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ జనాలు కొందరు కంటెస్టెంట్స్ కి మాత్రమే కనెక్ట్ అవుతున్నారు. అలాంటి వారిలో గీతూ, ఆర్జే సూర్య లాంటి వాళ్లు ఉన్నారు. కానీ టాప్-5లో ఉంటారనుకున్న ఈ ఇద్దరినీ కాస్త.. కొన్ని వారాల ముందే ఎలిమినేట్ చేసి పడేశారు. ప్రస్తుతం రేవంత్, ఇనయా లాంటి వాళ్లే.. ప్రస్తుతం ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తున్నారు.
ఇక తాజా ప్రోమో విషయానికొస్తే.. మొన్నటి వరకు గొడవ పడుతూ ఉన్న ఇనయా-శ్రీహాన్.. ఇప్పుడు మాత్రం ఒకరికొకరు అతుక్కుపోయారు. తెగ కెమిస్ట్రీ పండించారు. ఇక టికెట్ టూ ఫినాలే టాస్కులో భాగంగా.. ఒకరి స్నో మ్యాన్ పై మరొకరు దాడి చేయాలని, కంటెస్టెంట్స్ ఎవరిది వాళ్లు కాపాడుకోవాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ క్రమంలోనే శ్రీహాన్ స్నో మ్యాన్ పై ఇనయా ఎటాక్ చేసేందుకు వచ్చింది. అయితే హార్ష్ గా కాకుండా ఒకరిని ఒకరు పట్టుకుని, లాక్కుని సుతిమెత్తగా వ్యవహరించారు. వీళ్లని చూసిన సంచాలక్ శ్రీసత్య అయితే.. ‘మీరిద్దరూ ఏం చేస్తున్నారు?’ అని అడిగింది. ఆ టైంలో అక్కడే ఉన్న ఆదిరెడ్డి, రేవంత్,, బ్లాంక్ ఫేసులు పెట్టి కనిపించారు. ఇనయా అయితే.. ఎటాక్ చేశాను అని తెగ సిగ్గుపడుతూ చెప్పింది. అది ఎటాక్ లా లేదు, కావాలంటే టెలికాస్ట్ లో చూసుకోండి అని శ్రీసత్య పంచ్ వేసింది. ఈ వ్యవహారం చూసిన నెటిజన్స్.. ఇనయాని శ్రీహాన్ బాగా నలిపేశాడుగా అని కామెంట్స్ చేస్తున్నారు.