ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గత ఐదు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన ఈ షో.. ప్రస్తుతం ఆరవ సీజన్ దూసుకుపోతుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకి.. గతంలో మాదిరి ఆదరణ లభించట్లేదని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే హౌస్ లో సభ్యుల మధ్య ఎలిమినేషన్స్, నామినేషన్స్, వార్స్ బాగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఇటీవల నటి అభినయ శ్రీ షో నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వచ్చే వారం ఎలిమినేషన్స్ లో భాగంగా నటుడు శ్రీహన్ జాబితాలో చేరాడు.
గత సీజన్ లో బిగ్ బాస్ లో శ్రీహన్ ప్రియురాలు సిరి హన్మంత్ సభ్యురాలిగా పాల్గొంది. అయితే.. సిరి హౌస్ లో ఉన్నన్ని రోజులు బయట నుండి లవర్ శ్రీహన్ ఫుల్ సపోర్ట్ చేశాడు. ఇప్పుడు శ్రీహన్ బిగ్ బాస్ లోకి వెళ్లేసరికి సిరి బయటి నుండి తన మద్దతు తెలుపుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్స్ లో శ్రీహన్ పేరు రిస్క్ లో పడేసరికి సోషల్ మీడియా వేదికగా సిరి తన లవర్ శ్రీహన్ కి ఓట్లు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది. మరి హౌస్ లో శ్రీహన్ ఇంకా కొనసాగుతాడా లేదా? ఎలిమినేషన్స్ నుండి తప్పించుకునే ఛాన్స్ ఉందా లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.