ఎంతో అట్టహాసంగా బిగ్‌బాస్ సీజన్ 6 ఆదివారం(సెప్టెంబర్ 4) ప్రారంభం అయ్యింది. 21 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక 100 రోజుల పాటు వీరు బిగ్‌బాస్ హౌస్‌లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక బయట వీరి కోసం అభిమానులు కూడా ఓ రేంజ్‌లో కొట్టుకుంటుంటారు. అయితే బిగ్‌బాస్ షోకి అభిమానులు ఎంత మంది ఉంటారో.. తిట్టిపోసే వారు కూడా అదే రేంజ్‌లో ఉంటారు. ఆ విమర్శల సంగతి కాసేపు పక్కన పెడితే.. ప్రస్తుతం నెటిజనులు బిగ్‌బాస్ నిర్వహాకులపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. ఇంత మోసం చేస్తారా.. అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ట్రోల్స్‌కి భయపడి.. దెబ్బకు పాత వీడియోని డిలీట్ చేసింది బిగ్‌బాస్ టీమ్. ఇంతకు నెటిజనులు ఇంతలా ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి.. ఏ వీడియో డిలీట్ చేశారు అంటే..
బిగ్ బాస్ ప్రారంభానికి నాలుగు నెలల క్రితం అనగా మే 26న బిగ్‌బాస్ ప్రసారం అయ్యే టీవీ చానెల్‌లో వచ్చిన ఓ యాడ్ గుర్తుందా. అదే ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లోకి సామాన్యులకు అవకాశం అని నాగార్జున స్వయంగా వెల్లడించారు. ‘‘బిగ్‌బాస్ 6లో పాల్గొనాలని భావిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే.. ఇన్నాళ్లూ మీరు మీ ఇంట్లో కూర్చుని బిగ్‌బాస్ షోని చూశారు. ఇప్పుడు మీరే ఆ ఇంట్లో ఉండే అవకాశం లభించబోతుంది. మీకు వన్ టైం గోల్డెన్ ఆఫర్‌ని ప్రకటిస్తుంది. టికెట్ టూ బిగ్‌బాస్ సీజన్ 6’’ అంటూ ఓ వీడియోని సదరు చానెల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.
దీనికి భారీ ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. కుప్పలు తెప్పలుగా వీడియోలు వచ్చినట్లు సమాచారం. కానీ ఆదివారం నాటి బిగ్‌బాస్ ఎపిసోడ్ చూసిన జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరీ ఇంతలా మోసం చేస్తారా అంటూ షో నిర్వాహకులపై, నాగార్జునపై మండి పడుతున్నారు. కారణం.. ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 21 మంది కంటెస్టెంట్స్‌లో సామాన్యులు ఎవరు లేరు. అందరూ సెలబ్రిటీలే. మరి ఈ మాత్రం దానికి అంత ప్రచారం ఎందుకు చేశారు.. ఇలా మా ఆశాల మీద నీళ్లు కుమ్మరించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజనులు, ఆడిషన్స్‌లో పాల్గొన్నవారు.
ఇక యూట్యూబర్ ఆదిరెడ్డిని కామనర్ అన్నాడు హోస్ట్ నాగార్జున. అదే వేదిక మీద ఆదిరెడ్డి పెద్ద యూట్యూబర్ అని.. అతడికి యూట్యూబ్‌లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని.. బిగ్‌బాస్ రివ్యూలతో పాపులర్ అయ్యాడని స్పెషల్ ఏవీ వేసి మరి చూపించాడు. బిగ్‌బాస్ రివ్యూలతో సెలబ్రిటీగా మారిన ఆదిరెడ్డిని కామనర్స్ కోటాలో పంపడం ఏంటని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. పైగా అతడికి వెరిఫైడ్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ అకౌంట్‌లు ఉన్నాయి. యూట్యూబ్‌లో ఏకంగా మూడు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. మరి అలాంటప్పుడు అతడు సామాన్యుడు ఎలా అవుతాడు అంటూ నెటిజనులు మండి పడుతున్నారు.
ఇక ఇదిలా ఉండగా.. బిగ్‌బాస్‌లో సామాన్యులకు అవకాశం కల్పిస్తాం అని చెప్పి.. మే నెలలో సదరు చానెల్‌లో అధికారికంగా పోస్ట్ చేసిన ప్రోమోని ప్రస్తుతం యూట్యూబ్ నుంచి తొలగించారు. దాంతో కావాలనే సామాన్యులకు అవకాశం కల్పిస్తాం అని చెప్పి.. మోసం చేశారని అర్థం అవుతోంది అంటూ నెటిజనులు మండిపడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.