‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ఇంకా కొన్ని రోజులే ఉంది. గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి.. కంటెస్టెంట్లలో టెన్షన్ రెండూ పెరిగాయి. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అసలు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో కంటెస్టెంట్లకు ఒక క్లారిటీ వచ్చేసింది. వాళ్లు ఊహించింది ఏదీ బయట జరగడం లేదు అనే ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలతో సిరి- షణ్ముఖ్ రిలేషన్ విషయంలో సిరిపై షణ్ముఖ్ కు ఉన్నది నిజమైన స్నేహమా? లేక స్వార్థమా అని తేలిపోయింది అంటున్నారు. సిరిని ‘నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్. నిన్ను నువ్వు తక్కువగా ఎందుకు కన్సిడర్ చేసుకుంటావు?’ అని అడిగిన ప్రశ్నకు సిరి చెప్పిన సమాధానం.. షణ్ముఖ్ ను ‘నువ్వు ఎందుకు సిరి విషయంలో అంత పొసెసివ్? సిరిని ఎందుకు కంట్రోల్ చేస్తావు’ అని అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానాలతో అందరికీ అసలు విషయం తెలిసిపోయింది అంటున్నారు.
సిరి సమాధానం: నన్ను నేను వీక్ అని అనుకోను. నేను స్ట్రాంగ్ ప్లేయర్ నే. కానీ, షణ్ముఖ్ మొదటి నుంచి నన్ను గైడ్ చేయడం. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అన్నీ నాకు చెప్పేవాడు. మొదట్లో కొన్ని సంఘటనలో షణ్ముఖ్ నాకు సపోర్ట్ చేశాడు. నేను ఒకసారి నమ్మితే అంతే ఇంక. అందుకే షణ్ముఖ్ విన్నర్ కావాలని అనుకున్నాను. నన్ను నేను వీక్ ప్లేయర్ గా అనుకోవడం కాదు.
షణ్ముఖ్ సమాధానం: నేను సిరి విషయంలో పొసెసివ్ నేను ఒప్పుకుంటాను. మేము ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాం. నేను ఆమెను కంట్రోల్ చేయడం అని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి. నేను గేమ్ లో తనను ఫ్రీగా ఒదిలేస్తాను. బయట మాత్రం కొన్ని విషయాల్లో కంట్రోల్ చేస్తాను. ఎలా ఉండాలి అని చెప్తుంటాను. ఎక్కడ కంట్రోల్ చేయాలి. ఎక్కడ వదిలేయాలి అనే విషయాల్లో నేను కన్ వ్యూజ్ అయ్యాను. అందుకే తనపై అరవడం, గొడవలు అన్నీ జరిగాయి. సిరిని నేను టాప్-5 లో చాడాలి అనుకుంటున్నాను.
సిరి తనకు సహాయం చేసిన ఒక ఫ్రెండ్, తనకు సపోర్ట్ చేసిన ఒక ఫ్రెండ్, తాను ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఒక ఫ్రెండ్ విన్నర్ కావాలని కోరుకుంది. అది ఆమె ట్రూ ఎమోషనల్ అండ్ జెన్యూన్ అని ప్రేక్షకులకు కూడా అనిపించింది. అందుకే ఆమెను నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు అని ప్రశ్నించారు. అయితే షణ్ముఖ్ మాత్రం సిరిని టాప్-5లో చూడాలి అనుకున్నాడు. అంటే ఆమె విన్నర్ కావడం షణ్ముఖ్ కు ఇష్టం లేదా? సిరి కూడా షణ్ముఖ్ చాలా సందర్భాల్లో సపోర్ట్ చేసింది. చాలా టాస్కుల్లో షణ్ముఖ్ ను గెలిపించాలి అని ట్రై చేసింది.
కానీ, ఎప్పుడు ఆమె ఆ మాట చెప్పుకోలేదు. ఇప్పుడు షణ్ముఖ్ ఇచ్చిన ఆన్సర్ తో పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. అసలు షణ్ముఖ్ నిజంగానే సిరిని కంట్రోల్ చేస్తున్నాడా? సిరిని ఒక ట్రాన్స్ లో ఉంచి ఆమెపై ఆమెకు ఒక ఆత్మన్యునత వచ్చేలా చేశాడా? నిజంగానే షణ్ముఖ్ విన్నర్ అవ్వలని సిరిని అలా ఒక భమ్రలో ఉండేలా ఇన్ ఫ్లుఎన్స్ చేశాడా? అసలు నిజంగానే సిరి ఒక మంచి ఫ్రెండ్ లా చూశాడా? ఇప్పడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. అది బయటకు వచ్చాక నేరుగా షణ్ముఖ్ చెప్తేనే వినాలని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. సిరి విషయంలో షణ్ముఖ్ నిజంగానే జెన్యూన్ గా ఉన్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.