YS Jagan Mohan Reddy: పేదల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అద్భుతమైన పథకం అమలుకు రంగం సిద్ధం చేశారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అక్టోబర్ 1నుంచి ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేయనుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక కల్యాణమస్తు, షాదీ తోఫాలను ఆపేసిందన్న తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బిగ్ అనౌన్స్‌మెంట్ చేసింది. కల్యాణమస్తు, షాదీ తోఫాలో భాగంగా గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే ఎక్కువ నగదును లబ్ధిదారులకు అందించనుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, భవన కార్మిక కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫాలో భాగంగా..
ఇక, సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధిని కనబరుస్తున్నారు. ముఖ్యమంత్రి గతంలో అన్నట్టుగానే మేనిఫెస్టోను భగవద్గీత, బైబిలు, ఖురాన్‌లా అత్యంత పవిత్రంగా భావిస్తున్నారు. ఇప్పటికే 98.44 శాతం ఇచ్చిన హామీలను అమలు పరిచారు. మరి, అక్టోబర్ 1న అమలు కానున్న వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : E-Crop: దేశమంతటా ఈ-క్రాప్ అమలుకు కేంద్రం సన్నాహాలు! సీఎం జగన్ ఆలోచనే ఆదర్శంగా!