అదొక అందమైన పర్యాటక కేంద్రం. అక్కడికి నిత్యం కొన్ని వందల సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. దాంతో అప్పుడప్పుడు అక్కడ కొన్ని ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. పర్యటక ప్రదేశం చూస్తేనే మామూలుగా మంచి కిక్కు వస్తుంది. మరి మంచి కిక్కులో ఉండి పర్యటక ప్రదేశంలో హల్ చేస్తే ఎలా ఉంటుందో తాజాగా ఓ యువతి చేసిన వీరంగం చూస్తే తెలుస్తుంది. ప్రముఖ పర్యటక కేంద్రం అయిన అరకు లోయలో ఫుల్లుగా మద్యం తాగి ఓ యువతి నానా రచ్చ చేసింది. ఓ దుకాణ యజమానురాలితో ఏకంగా గొడవకే దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
అరకు.. అందమైన, ఆహ్లదకరమైన పర్యటక ప్రదేశం. దాంతో ఈ ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి వేలల్లో పర్యటకులు వస్తారు. దాంతో అక్కడి వాతావరణం సందడి సందడిగా మారుతుంది. అయితే కొందరు మాత్రం ప్రకృతి ఇచ్చే కిక్కు చాలక.. తమతో తెచ్చుకున్న మద్యం కిక్కులో మునుగుతారు. ఇక ఆ మద్యం కిక్కులో వారు ఏం చేస్తున్నారో వారికే తెలీదు. తాజాగా ఓ యువతి అరకు లోయలో మద్యం మత్తులో హల్ చల్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫూటుగా తాగిన సదరు యువతి స్థానికంగా ఉన్న ఓ దుకాణ యజమానురాలితో ఘర్షణకు దిగింది. అంతటితో ఆగకుండా ఆమెను బూతులు తిడుతూ.. నానా హంగామా సృష్టించింది. ఆ యువతి చేస్తున్న రచ్చకు చుట్టుపక్కల వారంతా షాక్ కు గురయ్యారు.
ఈ క్రమంలోనే షాప్ యజమానిని తిట్టిన తర్వాత ఓ చోట కూర్చున్న ఆ యువతి.. విచిత్రంగా ప్రవర్తించింది. తనను తానే కొట్టుకుంటూ.. నేనే తప్పు చేయలేదు.. నేనే తప్పు చేయలేదు అంటూ చెంపలు కొట్టుకుంటూ.. జుట్టు పీక్కుంటూ ఏడ్చింది. దాంతో చుట్టు పక్కల ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి వచ్చారు. అయితే ఆ యువతిని కారు ఎక్కమంటే ఎక్కుండా పోలీసులకు చుక్కలు చూపుతూ.. ముప్పు తిప్పలు పెట్టింది. ఓ వ్యక్తి ఆమెను కారులోకి ఎక్కించడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె మాత్రం కారు ఎక్కలేదు. కొంతసేపటి తర్వాత ఎట్టకేలకు పోలీసులు ఆమెను స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఎంత తాగితే మాత్రం ఇంతలా చేయాల అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మద్యం మత్తులో టూరిస్టు మహిళ వీరంగం. అరకులోయను వీక్షించేందుకు వచ్చి తాగిన మైకంలో షాప్ యాజమనిపై దాడికి యత్నం. పోలీసులోచ్చి కట్టడి చేసేందుకు ప్రయత్నించినా లెక్కచేయని లేడీ. అతి కష్టం మీద అదుపులో తీసుకున్న పోలీసులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag #Araku pic.twitter.com/PuCg8vTGU3
— Vizag News Man (@VizagNewsman) December 3, 2022