ఎక్కడినుంచో వచ్చిన కాకినాడ పండు తమపై అరాచకాలకు పాల్పడుతోందని వారు అన్నారు. కాకినాడ పండు తమను ఎంతో ఇబ్బంది పెడుతోందని పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో హిజ్రాలు రెండు గ్రూపులుగా విడిపోయి గొడవపడుతున్నారు. ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు. వేరే ప్రాంతంనుంచి వచ్చిన ఓ హిజ్రా దారుణాలకు పాల్పడుతోందని ఓ గ్రూపు ఆరోపిస్తోంది. ఏకంగా మీడియా ముందుకు వచ్చి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో హిజ్రా కాకినాడ పండు వ్యతిరేక వర్గం మాట్లాడుతూ.. ‘‘ కాకినాడ పండు అరాచకాలు భరించలేకపోతున్నాము. కాకినాడ నుంచి వచ్చిన పండు ఇక్కడ తిరుపతిలో పెత్తనం చేస్తోంది. నెల మామూళ్లు ఇవ్వాలంటూ దౌర్జన్యం చేస్తోంది. దాడులకు కూడా పాల్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 వేల మంది హిజ్రాలను పండు ఇబ్బంది పెడుతోంది. హిజ్రాలకు సంబంధించిన విషయంలో ఆమె రాయలసీమ మొత్తాన్ని కొన్నట్లు ప్రచారం చేసుకుంటోంది.
అందులో వాస్తవం లేదు. పండు మాపై దాడులు చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేశాము. అయినా వారు స్పందించలేదు. పండు నెలవారీ మామూళ్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోంది. తన మనుషులతో బెదిరిస్తోంది. కాకినాడ పండుపై చర్యలు తీసుకోవాలి. పండు కొన్ని ముఠాలతో కలిసి దౌర్జన్యాలకు దిగుతోంది. పోలీసులు ఇప్పటికైనా పండుకు చెక్ పెట్టి మమ్మల్ని రక్షించాలి’’ అని కోరారు. కాగా, గతంలోనూ కాకినాడ పండుపై హిజ్రాలు ఫైర్ అయ్యారు. నెల్లూరులో హిజ్రాలు ఏకమై పండుపై తిరగబడ్డారు. పండుకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరి, కాకినాడ పండుపై వేరే గ్రూపునకు చెందిన హిజ్రాలు మండిపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.