భార్యభర్తల బంధం ప్రత్యేకమైనది. విభిన్న మనసులు కలిగి పెళ్లి బంధంతో ఒక్కటై.. కష్టసుఖాల్లో ఒకరికొక్కరు తోడునీడా ఉంటూ దంపతులు జీవితాన్ని ముందుకు సాగిస్తుంటారు. అలా పిల్లాపాపలతో నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ప్రతి ఒక్క దంపతులు కోరుకుంటారు. కానీ అనుకోకుండా జరిగే ప్రమాదాలు దంపతుల బంధాన్ని తెంచేస్తాయి. తాజాగా విశాఖలో జరిగిన ప్రమాదం అలా ఓ జంటను విడదీసి, పిల్లలను తల్లిలేని అనాథను చేసింది. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో భర్త, పిల్లల ముందే ఓ వివాహిత ప్రాణాలు విడిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన గొర్లె అర్జునరావు, భార్య స్వర్ణ(30) కొన్నేళ్ల క్రితం పెళ్లి పెళ్లిచేసుకున్నారు. వీరిద్దరు ఉద్యోగులే. అర్జునరావు సబ్బవరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుండగా, భార్య స్వర్ణ వీఎంఆర్‌డీఏ ఉద్యోగి. ప్రస్తుతం వుడా పార్కులో టికెట్ బుకింగ్ కౌంటర్‌లో పని చేస్తోంది. వీరికి ఓ నాలుగేళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల కూతరు ఉంది. అర్జున రావు కుటుంబంతో ఉద్యోగరీత్యా సబ్బవరంలో నివసిస్తున్నాడు. ఇలా పిల్లపాపలతో అర్జున్ రావు, స్వర్ణలత హాయిగా జీవిస్తున్నారు.
ఇదీ చదవండి: వైజాగ్ సృజన ఆత్మహత్య.. ఈ పాపం ఎవరిది?
ఈక్రమంలో ఆదివారం ఉదయం స్వర్ణ.. తన ఇద్దరు పిల్లలు, కలసి భర్త బైక్ పై బుడతనాపల్లి నుంచి నగరంలోని ఆరిలోవలో తన పుట్టింటికి బయలుదేరింది.వీరు మారికవలస కూడలికి సమీపంలో పెట్రోలు బంకుకు ఎదురుగా వచ్చేసరికి అదే రోడ్డులో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న స్వర్ణ పడిపోయింది. ఆమెపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మరణించింది. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
కళ్లెదుటే తల్లి మృతిచెందడంతో పిల్లలిద్దరూ షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.