ఏపీలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి వ్యూహరచనలు పన్నుతున్నారు అధికార, ప్రతిపక్ష నేతలు. ప్రతిపక్ష నేతలు అధికార పక్షం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యారని.. ఏపిని అప్పుల పాలు చేశారని ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళితే.. అధికార పక్షం మాత్రం తాము చేసిన అభివృద్ది పనులు, అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ముందే రాజుకునేట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అధికార పక్షం తమ పరిపాలనలో చేసిన అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉంది. ఇక ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసందే. తాజాగా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కి తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. ఉరవకొండ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనసాగిస్తు సమయంలో ప్రమాదం తప్పింది. నారా లోకేష్ ఉరవకొండ నియోజకవర్గం కూడేరు లో పాదయాత్ర సందర్బంగా టీడీపీ అభిమానులు ఆయనకు గజమాలతో సత్కరించేందుకు సిద్దమయ్యారు. భారీ గజమాలను క్రేన్ సహాయంతో లోకేష్ కి వేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో క్రేన్ వైర్లు తెగిపోయాయి.. దాంతో గజమాల ఒక్కసారిగా ఆయన పై పడింది. అయితే వైర్లు తెగడం గమనించిన లోకేష్ వెంటనే అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ నారా లోకేష్ కి ప్రమాదం తప్పిపోవడంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ మద్యనే కదిరిలో లోకేష్ కుడి భుజానికి తీవ్ర గాయం అయ్యింది. పాదయాత్ర సందర్భంగా జనాలు ఆయనపై ఒక్కసారే పడిపోవడంతో కుడి భుజానికి గాయం అయి రెండు వారాలపాటు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడేరులో మరో ప్రమాదం తప్పిపోయింది. నేడు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి నివాళుర్పించారు నారా లోకేష్. ఇదిలా ఉంటే.. లోకేష్ యువగళం పాదయాత్రం మొదలు పెట్టినప్పటి నుంచి పోలీసు భద్రతా లోపాలు వెంటాడుతూనే ఉన్నాయని.. తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల్లో ఒక్కడే వెలుగుతున్న నారా లోకేష్…#YuvaGalamPadayatra #YuvaGalam #NaraLokesh pic.twitter.com/Ao2eZUABLs
— YuvaGalam (@yuvagalam) April 5, 2023