ఏపీ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్ద నడుస్తుంది. ప్రస్తుతం ఏపీలో అమరావతి ఇష్యూపై రగడ కొనసాగుతుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ యన్టీఆర్ చేసిన తప్పు ఒక్కటే గుడ్డిగా చంద్రబాబు ని నమ్మడం. చంద్రబాబు కి ఏ మాత్రం విశ్వాసం లేకుండా ప్రవర్తించాడు.. ఇప్పుడు వచ్చి నీతి మాటలు మాట్లాడుతున్నాడు.
పనికి రాని మాటలు మాట్లాడుతూ చంద్రబాబు కాలం వెల్లదీస్తున్నాడని విమర్శించారు. నేను ఎంతగానో అభిమానించిన హరికృష్ణ నన్ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చాడు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది జూనియర్ యన్టీఆర్. వాళ్లకు ఎప్పుడూ రుణపడి ఉంటా. నాకు ఇప్పటికీ యన్టీఆర్ కుటుంబం అంటే అభిమానం. చంద్రబాబు చరిత్ర మొత్తం నాకు తెలుసు సీనియర్ యన్టీఆర్ నే కాదు.. ఇప్పుడు జూనియర్ యన్టీఆర్ ని కూడా వదలడం లేదు. అమరావతి రైతుల ముసుగులో కొన్ని రోజులుగా జూనియర్ యన్టీఆర్ ని తిట్టిస్తున్నారు. యన్టీఆర్ చస్తే ఏంటీ బతికితే ఏంటీ అంటున్నారు.. అంటే 37 ఏడేళ్లు లేవు అతన్ని చంపేయాలంటా..? ఈయనకు 73 ఏళ్లు హాయిగా బతికి ఉండాలంట అంటూ చంద్రబాబు పై ఫైర్ అయ్యారు.
మొన్నటి ఎన్నికల్లో ఆయనకు 23 సీట్లు రావడంతో చంద్రబాబు పతనం మొదలైందన్న విషయం గ్రహించి ఇప్పుడు రక రకాల ఎత్తులు వేస్తున్నాడని విమర్శించారు కొడాలి నాని. రాజకీయాల్లో నాకు నలభై ఏళ్ల సీనియార్టీ ఉందని ప్రగల్భాలు పలికే చంద్రబాబూ.. నీ సమకాలికుడైన రాజకీయ నేత కొడుకు కొత్త పార్టీ పెట్టి నిన్ను భూస్థాపితం చేశాడు.. ఇప్పటికీ ఆ విషయం జీర్ణించుకోలేక పోతున్నావు.. అసెంబ్లీలో ఏడ్చావు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పై కొడాలి నాని చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.