పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పూర్తి దృష్టిని రాజకీయాలపైనే కేంద్రీకరించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలానే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారిపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో జనవాణి కార్యక్రమం ప్రకటించిన సందర్భంగా విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైజాగ్ వేదికగా పవన్ కల్యాణ్‌పై దాడి చేసేందుకు కొందరు కుట్ర చేశారంటూ కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ బాంబు పేల్చగా.. తాజాగా ఇప్పుడు మరోసారి సంచలన ఆరోపణలు చేస్తోంది. పవన్ కల్యాణ్ ప్రమాదంలో ఉన్నారని.. ఆయనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారంటూ కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇది సంచలనంగా మారింది.
పవన్ కళ్యాణ్.. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అనుసరిస్తున్నారని జనసేన ఆరోపిస్తోంది. అంతేకాక టూవీలర్స్, ఇతర వాహనాల్లో వెంబడిస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లో పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని ఈ సందర్భంగా జనసేన వెల్లడించింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. పవన్ కళ్యాణ్ ప్రమాదంలో ఉన్నారని.. అనుమానంగా ఉందని ఆరోపిస్తోంది. ఈ మేరకు జనసేన ముఖ్య నేత.. నాదేండ్ల మనోహర్ పేరుతో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిలో పలు సంచలన విషయాలు వెల్లడించింది.
ఇక లేఖలో.. విశాఖ సంఘటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర చాలా మంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారని తెలిపింది. పవన్ కల్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు.. తిరిగి వస్తున్న సమయంలో ఆ వాహనాలు.. ఆయనను ఫాలో అవుతున్నాయంది. అంతేకాక ఇలా వాహనాల్లో తిరుగుతున్న వ్యక్తులు పవన్ కల్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని.. అయితే వాళ్లు అభిమానులు మాత్రం కాదని స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది కూడా ఇదే విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. ఇలా ఫాలో అవుతున్న వారి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు అని లేఖలో వెల్లడించింది.
2-3 people who are found suspicious at Pawan Kalyan’s house from last 2 days are taken into custody. Below pictures are found based on CCTV footage 🤷🏻♂️🤷🏻♂️ pic.twitter.com/qGJ6mYXYYN
— vb4 (@am_johnny_) November 2, 2022
అంతేకాకా.. సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు.. పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారని.. ఇంటికి ఎదురుగా కారు ఆపి గలాటా చేశారని తెలిపింది. సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడటమే కాక. వారిని బూతులు తిడుతూ దుర్భాషలాడినట్టు పేర్కొంది. సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డారు. ఈ సంఘటనను వీడియో తీసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. మంగళవారం నాడు బైక్‌పై.. బుధవారం కారులోనూ.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పవన్‌ని అనుసరించారు. ప్రస్తుతం ఈ లేఖ, జనసేన చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు – JanaSena PAC Chairman Sri @mnadendla pic.twitter.com/MSlsNUwmbH
— JanaSena Party (@JanaSenaParty) November 2, 2022
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు – JanaSena PAC Chairman Sri @mnadendla pic.twitter.com/MSlsNUwmbH
— JanaSena Party (@JanaSenaParty) November 2, 2022
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు
* ఇంటి వద్ద సైతం సంచారం
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనుమానాస్పద వ్యక్తులు ఈ మధ్య ఎక్కువగా అనుసరిస్తున్నారు. – Sri @mnadendla (1/6)— JanaSena Party (@JanaSenaParty) November 2, 2022