ప్రేమ మత్తులో మునిగిపోయిన ప్రేమికులకు లోకం ఏమనుకున్నా పట్టించుకోరు. ఇక పెద్దవాళ్లకు తెలియకుండా చిట్ చాట్స్, బైక్ పై చక్కర్లు, పార్కులో దోబూచులు ఉండనే ఉన్నాయి. ఇక అడ్డు చెప్పేవారే లేకపోతే..సహజీవనం లాంటివి సాగించేస్తారు. ఈ సహజీవనమే ఓ వ్యక్తి మరణానికి కారణమైంది.
ప్రేమ, సహజీవనం ఇవేప్పుడు యువతలో క్రేజీ థింగ్సే. ప్రేమ మత్తులో మునిగిపోయి జగత్తును సైతం మర్చిపోతారు ప్రేమికులు. ఇక పెద్దవాళ్లకు తెలియకుండా చిట్ చాట్స్, బైక్ పై చక్కర్లు, పార్కులో దోబూచులు ఆడుతుంటారు. పెళ్లి చేసుకోవడానికి ముందు వారి గురించి తెలుసుకోవాలన్న తాపత్రయంతో ముద్దు మురిపాలు వంటివి కానిచ్చేస్తారు. ఇక అడ్డు చెప్పేవారే లేకపోతే..సహజీవనం లాంటివి సాగించేస్తారు. అయితే ఆ సహజీవనంలో కూడా అర్థం చేసుకునే దానిపైనే ఆధారపడి ఉంటుంది. కొంచెం తేడా కొట్టినా.. ఇరువురి మధ్య తగాదాలు ఏర్పడి ఒక్కొక్కసారి తలనొప్పులు తెస్తాయి. చివరకు బ్రేకప్ లేదా పేకప్ చెప్పుకుంటారు. కానీ అందులో హింసాత్మక ధోరణి ఉంటే అదీ ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే పరిస్థితులు ఏర్పడతాయి. ఇదే సహజీవనంలో ఏర్పడ్డ పొరపచ్ఛాలు ప్రియుడ్ని హతమార్చేందుకు దారి తీశాయి.
మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడ్ని హతమార్చిందో ప్రియురాలు.. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కంఠేవరం కాలవ కట్ట ప్రాంతానికి చెందిన గద్దె రాము తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి వివాహం కాలేదు. అదే ప్రాంతానికి చెంది గొంతు బోయిన ఆమని అనే మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే రాముకు మద్యం సేవించే అలవాటు ఉంది. గురువారం రాత్రి మద్యం సేవించి.. ఇంటికి చేరుకున్నాక.. పొద్దునే శవమై కనిపించాడు.
ఏం జరిగిందో తెలియదు కానీ.. మద్యం మత్తులో అతడిని గొంతు కోసి చంపేసింది ఆమని. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తొలుత ఆమనిని విచారించగా.. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించగా..ఆమెను పోలీసులు వారి స్టైల్లో విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి, మరికొంత మంది సాక్ష్యులను విచారిస్తున్నారు. నిందితురాలిగా భావిస్తున్న ఆమనిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.