గుండెపోటు.. దీని దెబ్బకు ఎవరు, ఎక్కడ ప్రాణాలు కోల్పోతారో అర్థమవ్వడం లేదు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ ఒకరు, గ్రౌండ్లో షటిల్ ఆడుతూ మరొకరు, పెళ్లి పీటల మీద ఇంకొకరు, పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ యువకుడు.. విధుల్లో ఉన్న బస్ కండక్టర్, కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురు.. ఇలా ఎక్కడిక్కడ.. ఎవరికి వారు గుండెపోటుకు గురై కుప్పకూలిపోతున్నారు.
గుండెపోటు.. ఈ పేరు చెప్తేనే జనాలు హడలెత్తిపోతున్నారు. దీని దెబ్బకు అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న వారు సైతం అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. అందులోనూ వయస్సుతో సంబంధం లేకుండా యువకులు సైతం సడన్ హార్ట్ ఎటాక్ కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. జిమ్ చేస్తూ ఒకరు, షెటిల్ ఆడుతూ మరొకరు, సినిమా చూస్తూ ఇంకొకరు.. ఇలా అన్నిచోట్లా ఈ మృత్యువు దర్శనమిస్తోంది. దీంతో ఈ మహమ్మారి ఎప్పుడు, ఎవరిని, ఏ విధంగా కబళిస్తుందో అని అందరిలోనూ భయం పట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా, విధుల్లో ఉన్న ఓ సీఐ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కిల్స్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు ఎప్పటిలానే ఈ రోజు విధులకు హాజరయ్యారు. అందరితో కలిసిమెలిసి తిరిగారు. అంతలోనే ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఆస్పత్రికి తరలించిన కాసేపటికే ఆయన కన్నుమూశారు. దీంతో కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఆయన గుండెపోటుకు గురై మృతి చెందడం తోటి వారికి ఆందోళన కలిగిస్తోంది. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనమూ కోరుకుందాం..