కార్లు, బైక్‌లు ఎక్కడపడితే అక్కడ ఆపగలం. కానీ విమానాల సంగతి అలా కాదు.. అవి ల్యాండ్ అవ్వాలంటే.. రన్‌వే అవసరం. అలాంటిది.. విమానలు హైవే మీద ల్యాండ్ అయితే.. అదేంటి.. రోడ్డు మీద విమానాలు ఎలా ల్యాండ్ అవుతాయి.. అనిపిస్తుందా.. అయితే ఇది చదవండి.. పూర్తి వివరాలు మీకే తెలుస్తాయి. ఈ అరుదైన ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. రాష్ట్రంలోని విజయవాడ-ఒంగోలు మధ్యనున్న జాతీయ రహదారిపై విమానాలు ల్యాండ్ అవ్వనున్నాయి. ఎందుకు ఇలా హైవే మీద రన్ వే అంటే.. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల సమయంలో.. సహాయక కార్యక్రమాలు చేపట్టడానికి, జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వీలుగా.. జాతీయ రవాణా వ్యవస్థ మెరుగైన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా హైవేపై రన్‌వే కార్యక్రమాన్ని చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా.. పరిధిలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి.. ఈ అరుదైన కార్యక్రమానికి వేదిక కానుంది. విపత్కర పరిస్థితుల్లో.. విమానాల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలంటే.. అన్ని చోట్ల రన్‌వేలు అందుబాటులో ఉండవు. అలాంటి పరిస్థితుల్లో.. హైవేల పైనే.. విమానాల అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేయాలని కేంద్రం భావించింది. దీనిలో భాగంగా.. ప్రధానమంత్రి గతిశక్తి మిషన్ కింద.. దేశవ్యాప్తంగా.. 28 ప్రాంతాల్లో.. హైవేలపై రన్‌వే నిర్మాణాన్ని ప్రారంభించింది. దానిలో భాగంగా ఏపీలో కూడా బాపట్ల జిల్లాలో హైవేపై రన్‌వే నిర్మాణం చేపట్టింది. గురువారం.. దీనిపై ట్రయల్ రన్ నిర్వహించారు.
మరి దేశవ్యాప్తంగా ఇలాంటి రన్‌వేలను నిర్మించవచ్చు కదా అంటే.. అన్ని ప్రాంతాలు.. ఇలాంటి నిర్మాణాలు అనుకూలంగా ఉండవు. మరీ ముఖ్యంగా హైవే మీద రన్‌వే నిర్మాణం చేపట్టాలంటే.. 3.5-5 కిలోమీటర్ల వరకు రోడ్డు మధ్యలో ఎలాంటి ఆటంకాలు అంటే టోల్ ప్లాజాలు, ఫ్లైఓవర్లు వంటివి ఉండకూడదు. స్ట్రెయిట్ రోడ్ అందుబాటులో ఉండాలి. అందుకే అన్ని చోట్ల ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం కూదరదు.
విదేశాల్లో ఇలాంటి నిర్మాణాలు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయి. కానీ మన దేశంలో.. ఈ మధ్య కాలంలో ప్రాంరభించారు. ఇక ఉత్తర భారతదేశం, సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు 19 వరకు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా రన్‌వేలు రెండున్నాయి. వీటిల్లో కొరిశపాడులోని 16వ నంబర్ జాతీయ రహదారిపై విజయవాడ–ఒంగోలు మధ్య ఎయిర్ పాడ్‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం రేణింగవరం, కొరిశపాడు గ్రామాల మధ్య హైవేపై 5 కిలోమీటర్ల మేర.. విమానాలు దిగేలా.. జాతీయ రహదారిపై సిమెంట్ రోడ్డును నిర్మించారు. ఇక ఈ రన్‌వేలను వివిధ దశల్లో పరిశీలించిన తర్వాత మాత్రమే.. విమానాల ల్యాండింగ్‌కు అనుమతిస్తారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత.. వచ్చే ఏడాది.. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా.. ఈ రన్ వేను ప్రారంభించనున్నారు.
విపత్తు సమయాలు, ఎమర్జెన్సీ టైంలో.. విమానాలు అత్యవసరంగా దిగడానికి.. ఇలాంటి హైవే రన్‌వేలు ఎంతగానో ఉపకరిస్తాయని అధికారలు తెలుపుతున్నారు. గురువారం ఈ హైవేపై వైమానిక విమానాలు ల్యాండ్ అవ్వటానికి ట్రయల్ రన్ నిర్వహించారు. ఒక కార్గో విమానంతో పాటు రెండు ఫైటర్ జెట్ విమానాలు దిగాయి. ట్రయల్ రన్ కోసం రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లు తొలగించడంతో పాటు.. రేడియం రంగులు వేశారు. ఇక విమానాల సిగ్నల్ కోసం రాడార్ వాహాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ట్రయల్ రన్‌కు వచ్చే విమానాలు.. పూర్తిగా ల్యాండ్ అవ్వకుండా.. రన్‌వేపై వంద మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తాయని వాయుసేన అధికారులు తెలిపారు. రాడార్ నుంచి సిగ్నల్స్ అందుతున్నాయా లేదా అన్నది చెక్ చేయడం కోసం ఇలా తక్కువ ఎత్తులో ప్రయాణించాయని తెలిపారు. ఇప్పటి వరకు దీనికోసం సుమారు 70 కోట్ల రూపాయలు ఖర్చయిందని.. ప్రాజెక్ట్ పూర్తయ్యాక మొత్తం వివరాలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.