అఘోరాల జీవన శైలీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారు సామాన్య జనానికి భిన్నంగా కనిపిస్తుంటారు. అలానే వీరు జనవాసాలకు దూరంగా ఉంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో తరచూ గ్రామాల్లో పట్టణాలలో వీరి సంచారాం కనిపిస్తుంది. తాజాగా మాజీ మంత్రి ఇంట్లో అఘోరాలు ప్రత్యక్షమయ్యారు.
అఘోరాల జీవన శైలీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారు సామాన్య జనానికి భిన్నంగా కనిపిస్తుంటారు. అలానే వీరు జనవాసాలకు దూరంగా ఉంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో తరచూ గ్రామాల్లో పట్టణాలలో వీరి సంచారాం కనిపిస్తుంది. గతంలో అఖండ సినిమా సమయంలో థియేటర్లలో ప్రత్యక్షమయ్యారు. అలానే పలు గ్రామాల్లో సంచరిస్తూ కనిపించారు. అయితే తాజాగా మాజీ మంత్రి ఇంటికి అఘోరా వెళ్లాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మరి.. ఆ మాజీ మంత్రి ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎండీ ఫరూక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఏపీ శాసనమండలిలో కొనసాగుతున్నారు. అయితే సోమవారం నంద్యాల పట్టణంలో మాజీ మంత్రి ఫరూక్ ఇంట్లో అఘోరా ప్రత్యక్షమయ్యాడు. మాజీ మంత్రి ఇంట్లో ఇలా అఘోరా ప్రత్యక్షం కావడంతో స్థానికంగా చర్చ ప్రారంభమైంది. రామేశ్వరం వెళుతూ అఘోరా, స్వామీజీలు ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్సీ ఫరూక్ అఘోరాలను ఇంటిలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో మంచి విజయం సాధిస్తారని స్వామిజీలు ఆశీర్వదించారు. అఘోరా చెప్పిన మాటలకు ఫరూక్ సంతోషం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఫరూక్ కు ఆశీస్సులు అందించి అఘోరా, స్వామీజీలు తయాత్తు కట్టారు. కాసేపు ఫరూక్ తో ముచ్చటించి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీడీపీ ఎమ్మెల్సీ ఫరూక్ ఇంటికి అఘోరా వెళ్లి.. ఆయన్ను ఆశీర్వదించడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఒంటినిండా విభూధి ధరించి.. రుద్రాక్ష మాలతో ఉన్న అఘోరా ఫరూక్ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. మాజీ మంత్రి ఇంట్లో అఘోరా ప్రత్యక్షం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.