ప్రస్తుత కాలంలో బాగా డిమాండ్ ఉన్న జాబ్ ఏది అంటే.. ప్రతి ఒక్కరు చెప్పే సమాధానం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. వేలకు వేలు జీతం.. వీకెండ్స్ ఎంజాయ్‌మెంట్.. విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్న ఫీల్డ్ కావడంతో.. చాలామందికి సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది ఓ కల. అయితే ఏటా మన దగ్గర వేల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి.. బయటకు వస్తున్నారు. వీరిలో కనీసం 10 శాతం మంది కూడా సాఫ్ట్‌వేర్ రంగంలో జాబ్ సాధించలేకపోతున్నారు. ఇక చాలా మంది.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం రకరకాల కోర్సులు నేర్చుకుంటారు. అయినా సరే.. ఉద్యోగం రాదు. ఎందుకంటే.. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో డిమాండ్ ఉన్న కోర్సులు ఏంటి.. ఏవి నేర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఈ లోపు వేరే వారు వచ్చేస్తుంటారు. దాంతో ఇన్నాళ్లు.. ఎందుకు జాబ్ రాలేదనే ప్రశ్న ఎదురవుతుంది. దాంతో చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
ఈ నేపథ్యంలో.. సాధారణ డిగ్రీ అయినా.. బీటెక్, ఎంసీఏ లాంటి డిగ్రీ పూర్తి చేసిన వారు ఎవరైనా సరే.. 45 రోజుల వ్యవధిలో సాఫ్ట్‌వేర్ జాబ్ పొందవచ్చు అంటున్నారు రాజ్‌ఇన్‌ఫర్మేటికా సంస్థ స్థాపకులు నట్‌రాజ్. ఆయన 11 సంవత్సరాలుగా సాఫ్ట్‌వేర్ రంగంలో రాణిస్తున్నారు. ఇక ఇంటర్వ్యూకి వచ్చే క్యాండెట్‌లు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. రాజ్‌ఇన్‌ఫర్మేటికా సంస్థను స్థాపించారు. సాఫ్ట్‌వేర్ జాబ్ సాధించాలంటే.. ఏ కోర్సులు అవసరం అవుతాయో వాటిల్లో ట్రైనింగ్ ఇస్తూ.. జాబ్ పొందేందుకు సహాయం చేస్తున్నారు. మరి ఈ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది.. వారిని ఎలా కలవాలి.. ఏ కోర్సులకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు.. వంటి పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.