ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకర్షిస్తున్న వాట్సాప్.. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ వ్యవహారాలను ట్రాక్ చేసే వాబీటాఇన్ఫో ప్రకారం.. మెసేజ్ ‘ఎడిట్’ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనం పంపిన వాట్సప్ మెసేజ్ లో ఏవైనా పొరబాట్లు ఉంటే దాన్ని డిలీట్ చేయడం తప్పితే మరో అవకాశం లేదు. అలా కాకుండా మెసేజ్ పంపిన తర్వాత కూడా ఆ సందేశాన్ని మార్చుకునే సదుపాయాన్ని.. ఈ ఎడిట్ ఆప్షన్ కల్పించనుంది.
వాట్సాప్ వ్యవహారాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ వెబ్‌టాఇన్ఫోలో ఈ ఫీచర్ కనిపించింది. ప్రస్తుతం డెవలప్ అవుతున్న ఎడిట్ ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను వెబ్‌టాఇన్ఫో షేర్ చేసింది. అందులో మెసేజ్‌ను సెలెక్ట్ చేయగానే.. ఇన్ఫో, కాపీ ఆప్షన్లతో పాటు.. ‘ఎడిట్’ ఆప్షన్ ఈ స్క్రీన్‌షాట్‌లో కనిపిస్తోంది.
WhatsApp is working on editing text messages!
WhatsApp is finally developing a feature that lets us edit text messages for a future update of the app!
More details are available in the post 🤩https://t.co/lLooTyrgWm pic.twitter.com/QLCNBBlWra— WABetaInfo (@WABetaInfo) May 31, 2022
వాబీటాఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం.. ఏదైనా మెసేజ్ పంపిన తర్వాత దాన్ని సెలక్ట్ చేస్తే.. కేవలం కాపీ, ఫార్వర్డ్ వంటి ఆప్షన్లు మాత్రమే కనిపిస్తాయి. అయితే, ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా యాడ్ అవ్వనుంది. ఈ ఆప్షన్‌ను క్లిక్ చేసినట్లు అయితే.. మెసేజ్‌లో ఏమైనా తప్పులున్నా.. ఎడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో దీన్ని టెస్ట్ చేస్తున్నారు. అయితే, ఐఓఎస్, డెస్క్టాప్ వెర్షన్లలోనూ ఒకేసారి ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
WhatsApp was planning to develop the ability to edit messages more than 5 years ago. Finally it is back 😅😍 https://t.co/WZLfdwrqNt
— WABetaInfo (@WABetaInfo) May 31, 2022