దేశంలో ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరోపక్క పర్యావరణ కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతుంది. దీంతో అందరి ద్రుష్టి ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. రోడ్లపై ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బైకులు చక్కర్లు కొడుతున్నాయి. రాను రాను అదే స్థాయిలో కార్లు కూడా పరుగులు పెట్టనున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆటో పరిశ్రమలు సైతం.. ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ద్రుష్టి సారించాయి. ఈ మధ్యనే.. సౌత్ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా.. Kia EV6ను లాంచ్ చేయగా.. దేశీయ కంపెనీ హ్యుందాయ్.. Hyundai IONIQ 6 పరిచయం చేసింది. వీరి బాటలో మరో సంస్థ చేరింది. స్వీడిష్ దిగ్గజం వోల్వో ఎట్టకేలకు తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఎక్స్ 40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ పేరిట తీసుకొస్తున్న ఈ ఎస్ యూవీ ధర రూ.55.90 లక్షలు. పెట్రోల్‌వెహికల్ ఎక్స్‌సి 40తో పోలిస్తే రూ 1.40 లక్షలు ఎక్కువ. భారత్ లో అసెంబుల్ చేస్తున్న తొలి విలాసవంత విద్యుత్తు.. కారు ఇదే. జులై 27 నుంచి కంపెనీ వెబ్ సైట్ లో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. రూ. 50 వేలు చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. అక్టోబరు నుంచి వినియోగదారులను అందజేస్తామని కంపెనీ తెలిపింది. @volvocarsin Car India today launched at ₹55,90,000 its much-awaited pure electric #XC40Recharge on metaverse which the company named as ‘VolvoVerse’. Volvo XC40 Recharge will be the first CKD locally assembled luxury electric vehicle in India. pic.twitter.com/dt2c0YxtfA — Amit khare (@viacarguru) July 26, 2022 కాంపాక్ట్ మాడ్యులార్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్ పై వోల్వో ఎక్స్ 40 రీచార్జ్ ను నిర్మించారు.11కిలో వాట్ వాల్-బాక్స్ ఛార్జర్‌తో వస్తుంది. అలాగే.. 150kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం గల 78kWh బ్యాటరీని ఈ కారులో అందించింది. దీంతో 40 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జ్ అవుతుందని పేర్కొంది. అదే సాధారణ 11kW AC ఛార్జర్ తో అయితే పూర్తి చార్జింగ్ కు ఎనిమిది గంటలు పడుతుందని వెల్లడించింది. ఇది రెండు విద్యుత్తు మోటార్లతో నడుస్తుంది. 860nm టార్క్ వద్ద 1112 bhp శక్తిని విడుదల చేస్తుంది. కేవలం 4.9 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 418 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ఇక పీచర్ల విషయానికి వస్తే.. కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అమర్చారు. కనెక్టడ్ కార్టిక్, పానరోమిక్ సన్‌రూఫ్, అడాస్ వంటి ఆప్షన్లను అందులో పొందుపరిచారు. బెంగళూరు సమీపంలోని హోస్కోట్ యూనిట్ లో ఈ కారును అసెంబుల్ చేయనున్నారు. మినీ కూపర్ ఎస్ఈ, కియా ఈవీ6, ఆడీ ఈ-ట్రాన్, బీఎండబ్ల్యు వారి వంటి కార్లకు ఇది పోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వోల్వో XC40పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Introducing the Pure Electric Volvo XC40 Recharge, the first of a whole new range of all-electric vehicles. Smart and versatile, designed For Every You. To know more: https://t.co/DZ6qw4aXre#XC40Recharge #FutureIsElectric pic.twitter.com/VKwUyo6RMw — Volvo Car India (@volvocarsin) July 26, 2022 ఇదీ చదవండి: Hyundai: టెస్లాను తలదన్నేలా హ్యుందాయ్ సరికొత్త ఎలక్ట్రిక్ కార్.. అయోనిక్ 6! ఇదీ చదవండి: Kia EV6: సూపర్బ్ లుక్, అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటున్న కియా ఎలక్ట్రిక్ కార్..!