ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి అందరికీ తెలుసు. దాదాపు ఈ యాప్ లేని ఫోన్ ఉండదేమో అనడం అతిశయోక్తి కాదు. ఈ యాప్ లో మీ ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, బంధువులకు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, హ్యాపీ సండే అంటూ రోజూ చాటింగ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఫార్వాడ్ మెసేజ్ లు కూడా చాలా ఎక్కువయ్యాయి. అదే ఏదన్న పండగో లేక ఏ ఫ్రెండ్షిప్ డేనో అయితే ఇంక మెసేజులు, స్టాటస్ లు వాట్సాప్ అంతా హోరెత్తిపోతుంది. ఇప్పుడు అలాంటి సందర్భాన్ని కొందరు కేటుగాళ్లు అవకాశంగా మార్చుకుని అమాయకుల ఖాతాలు ఖాళీ చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 19న ఫాదర్స్ డే సందర్భంగా గత మూడ్రోజులుగా వాట్సాప్ లో ఓ మెసేజ్ బాగా సర్క్యులేట్ అవుతోంది. ఫాదర్స్ డే సందర్భంగా ఈ లిక్ ఓపెన్ చేస్తే ఫ్రీగా హైనకీన్ బీర్లు వస్తాయంటూ చెబుతున్నారు. హైనకీన్ బీర్ ఫొటో, దానితోపాటు ఓ లింకును ఫార్వాడ్ చేస్తున్నారు. ఆ మెసేజ్ లో ‘హైనకీన్ ఫాదర్స్ డే కాంటెస్ట్’ లో భాగంగా ‘5 వేల కూలర్ల నిండా హైనకీన్ బీర్లు’ ఉచితంగా ఇస్తున్నారంటూ ఉంది. అయితే ఆ లింకు మీద క్లిక్ చేయగానే.. ఫిషింగ్ పేజీలు ఓపెన్ అవుతాయి. ఆ వెబ్ సైట్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని కాజేస్తాయి. @Heineken_IE PS. SCAM going around. IF TAGGED. DONT OPEN ! pic.twitter.com/UsExaj7fsO — karen murray (@minnyminty) June 12, 2022 ఈ ఫాదర్స్ డే స్కామ్ పై స్యంవంగా హైనకీన్ సంస్థ కూడా స్పందించింది. ‘ఫాదర్స్ డై హైనకీన్ ఫ్రీ బీర్ కాంటెస్ట్ అనేది ఏమీ లేదు. మీరు అలాంటి ఫార్వార్డ్ మెసేజ్లను నమ్మకండి. అలా మీకు వచ్చిన లింకులపై క్లిక్ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోకండి. ఇలాంటి స్కామ్ జరుగుతున్నట్లు మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు.’ అంటూ హైనకీన్ సంస్థ ట్వీట్ చేసింది. ఫాదర్స్ డే వాట్సాప్ ఫ్రీ బీర్ స్కామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. SCAM ALERT! pic.twitter.com/r3a5c9h1IF — Heineken Nigeria (@Heineken_NG) June 14, 2022 A message to our customers: we’re aware of the current phishing scam circulating through social networks, which is not approved by HEINEKEN. We have contacted the relevant authorities, and urge people who do receive this message to delete it immediately. — Heineken® UK (@Heineken_UK) June 16, 2022 @Heineken aren’t giving away free beer or cooler. It’s a scam people. Spreading over WhatsApp. pic.twitter.com/UmudA2WEbC — Toon, Christian #standwithukraine (@christiantoon) June 12, 2022