ఎవరికైనా డబ్బు కలిసొచ్చినా.. మంచి జరిగినా నీ పంట పండింది అంటారు. అయితే అందరి కడుపు నింపే మెజారిటీ రైతుల పంట మాత్రం ఎప్పుడూ పండింది లేదు. కానీ ప్రస్తుతం చాలా మంది రైతులు లాభాల బాట పడుతున్నారు. దీంతో రైతుల పంట కూడా పండుతుంది.
ఎన్నడూ లేని విధంగా టమాటా పంట సిరులు కురిపిస్తుంది. తనను నమ్ముకున్న అన్నదాతను లక్షాధికారిని, కోటీశ్వరుణ్ణి చేస్తుంది. మొన్నటి వరకు టమాటా రైతు కన్నీరు కార్చగా.. ఈ ఏడాది మాత్రం లాభాలను చవి చూశాడు.
ఇటీవల భారీ వర్షాలు కురియడంతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్ లో టమాటా ధరలు ఆకాశాన్నంటిపోయాయి. ప్రస్తుతం టమాటా సాగు చేసి దిగుబడి చేస్తున్న రైతులు లక్షలు, కోట్లు అర్జిస్తున్నారు.