తిరుమల గదుల బుకింగ్స్, లడ్డూ ప్రసాద వితరణలో టీటీడీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
తిరుమల- కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ నలుమూల నుంచి, ప్రపంచ దేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి విచ్చేస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తులతో తిరుమల కలకలలాడుతూ ఉంటుంది. కరోనా నేపధ్యంలో గత యేడాది నుంచి తిరమలకు వచ్చే భక్తుల సంఖ్య ఘననీయంగా తగ్గిపోయింది. ఇక ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో క్రమ క్రంగా […]