95వ అకాడమీ అవార్డులలో భారతీయ డాక్యుమెంటరీ అయిన 'ఎలిఫెంట్ విస్పరర్స్' కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో తమిళనాడుకు చెందిన బొమ్మన్, బెల్లీ దంపతులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. తాజాగా వారి దగ్గర ఉన్న 5 నెలల ఏనుగు పిల్ల చనిపోయింది.
ఈసారి ఆస్కార్ వేడుకల్లో భారతదేశం సత్తా చాటింది. ఏకంగా రెండు పురస్కారాలతో హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే ఆస్కార్ సాధించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిర్మాత మాత్రం అవార్డు కమిటీ మీద సంచలన ఆరోపణలు చేశారు.
ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీలో నటించిన ఏనుగుల నటన ఆస్కార్ స్థాయి వరకూ వెళ్ళింది. ఈ సినిమాలో ఇద్దరు దంపతులు, ఏనుగులు వీళ్ళే ఉంటారు. ఏనుగులు, మనుషుల మధ్య జరిగే చక్కని కథతో కట్టిపడేస్తారు. అంత అద్భుతంగా ఈ చిత్రంలోని ఏనుగులు, మనుషులు జీవించారు. అందుకే ఈ చిత్రానికి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది. అయితే ఇంతటి సక్సెస్ కి కారణమైన ఏనుగులు అదృశ్యమయ్యాయి.
సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఇక ఆస్కార్ బరిలో ఇండియా నుంచి నామినేట్ అయిన ది ఎలిఫెంట్ విస్సరర్స్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అవార్డును అందుకుంది. మరి ఆ సినిమా కథ ఏంటి, ఎవరు డైరెక్ట్ చేశారు వంటి వివరాలు..
95వ ఆస్కార్ అవార్డులలో ఇండియన్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం చరిత్ర సృష్టించింది. ఇండియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ తో పాటు 'ది ఎలిఫెంట్ విస్ఫర్స్' ఆస్కార్ ఫైనల్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో 'ది ఎలిఫెంట్ విస్ఫర్స్' చరిత్ర సృష్టిస్తూ మొదటి ఆస్కార్ ని ఇండియాకి అందించింది.