ఏ విద్యార్ధి అయినా కోరుకునేది ఏంటి.. చదువుతో పాటు ఆటలు, పాటలు, వినోదం. అయితే ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలల్లో చదువు తప్ప వేరే యాక్టివిటీస్ ఉండవు. అడ్మిషన్ అప్పుడు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇస్తామని చెబుతారు గానీ అందులో నిజం ఉండదు. ఎంతసేపూ చదువు,చదువు అని విద్యార్థుల మీద ఒత్తిడి పెంచుతారు. ఆ ఒత్తిడి వల్ల నిద్ర సరిపోదు. దీని వల్ల జీవితం మీద విరక్తి పుడుతుంది. అందుకే కొందరు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
హైదరాబాద్ లోని నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై నిపుణుల విచారణ కమిటీ నివేదికను పరిశీలించిన తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.