నగరాల్లో కొత్త వ్యాపారం మొదలైంది. స్పా, థెరపీ ముసుగులో వ్యభిచార గృహలను నడుపుతున్నారు. పేరుకేమో మసాజ్ సెంటర్లు.. లోపలికెళితే గలీజు దందా నడుస్తుంది. ఉద్యోగాల కోసం నగరానికి వస్తున్న యువతులను కూడా మభ్య పెట్టి ఈ రొంపలోకి దింపుతున్నారు.
కొందరు ఈజీ మనీ, లగ్జరీ లైఫ్ కోసం అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలను మాయ మాటలతో మభ్యబెట్టి.. మోసం చేసి వారి దగ్గర అందిన కాడికి దోచుకుంటున్నవారు కొందరైతే.. మరికొందరు చెత్త పనులు చేస్తూ డబ్బులను ఆర్జిస్తున్నారు. వ్యాపారం ముసుగులో వ్యభిచారాన్ని చేసి డబ్బులు సంపాదిస్తున్న వారు మరికొందరు.
ఈ మద్య కొంతమంది లగ్జరీ జీవితాలకు అలావాటు పడి ఈజీ మనీ కోసం తప్పుడుబాటలో నడుస్తున్నారు. ఇందుకోసం వ్యభిచారం వృత్తిగా ఎంచుకుంటున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో హూటళ్ళు, లాడ్జీలు, బ్యూటీ పార్లర్ లు, స్పా సెంటర్స్ ని కేంద్రంగా చేసుకొని గుట్టుగా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పైకి పెద్దమనుషుల్లా చెలామని అవుతున్నప్పటికీ కొంత మంది కేటుగాళ్ళు వ్యభిచార దందాల్లో కోట్లు సంపాదిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి ఆన్ లైన్ నెట్ వర్క్ తో ఈ […]