హైదరాబాద్- తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. రైతు బంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 28 నుంచి రైతు బంధు సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లతో జరిగిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్, కలెక్టర్లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. […]
హైదరాబాద్- తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు పిలుపునిచ్చారు. గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, గంజాయిపై బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క కూడా ఉండేందుకు వీల్లేదని ఈ […]
అమరావతి- కరోనా ప్రపంచంలో అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. చాలా దేశాలు కరోనా దెబ్బకి ఆర్ధికంగా చితికిపోయాయి. ఐతే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కరోనా లాంటి క్లిష్ట సమయంలోను ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం లేదు. ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమ పధకాలను ప్రవేశపెడుతూ ఏపీ సీఎం జగన్ ప్రజాభిమానాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం కరోనా కష్టకాలంలోనూ అన్నదాతలకు జగన్ ప్రభుత్వం తీపుి కబురు చెప్పింది. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ […]