కోటీశ్వరులు అవ్వాలని కలలు కంటే సరిపోదు.. అందుకు అనుగుణంగా ఆదాయం ఉండాలి. పోనీ, అలా ఆదాయం ఉన్నంత మాత్రాన ఒక్కనెలలోనో.. ఒక్క ఏడాదిలోనో కోటీశ్వరులు అవ్వడం అసాధ్యం. అందుకున్న ఏకైక సురక్షిత మార్గం.. 'పొదుపు'. నెలనెలా కొంత మొత్తంలో పొదుపు చేస్తూ పోతే కొన్నేళ్ళకు కోటి రాబడిని నిజంగానే పొందవచ్చు. అదెలా అన్నది ఇప్పుడు చూద్దాం..
ఈ ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మీరు కోటీశ్వరులు అవుతారు. వడ్డీ రూపంలోనే కోటి రూపాయలు వస్తున్నాయంటే ఎంత మంచి పథకంలో ఆలోచించండి. మరి నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి? ఈ పథకం ఏంటి? అనే వివరాలు మీ కోసం.
పెద్దలు ఎంత చేసినా, ఏం చేసినా పిల్లల కోసమే. పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ప్రతీ తల్లి, తండ్రి అనుకుంటారు. అందుకే తమకి కాస్తో, కూస్తో అవగాహన ఉన్న ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెడుతుంటారు. ఇప్పటికే పిల్లల కోసం పోస్టాఫీస్, బ్యాంకులు, పాలసీ కంపెనీలు చాలా పథకాలు అందుబాటులోకి తెచ్చాయి. వాటిలో ఎక్కువ మంది ఆసక్తి చూపించేది పొదుపు పథకాలకే. ఎందుకంటే వడ్డీ తక్కువైనా గానీ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. చిన్న మొత్తాల పొదుపు […]
చిన్న పొదుపు పథకాలు చాలా పాపులర్. రిస్క్ లేకుండా మంచి వడ్డీ అందించే పథకాల పట్ల జనం ఎప్పుడూ ఆకర్షితులవుతారు. అలాంటి వాటిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్టాఫీస్ వంటి పథకాలు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఈ పొదుపు ఖాతాల్లో పెట్టుబడి పెట్టిన వారి సొమ్ముపై వడ్డీ రేట్లు పెరుగుతాయని అనుకున్న్నారు. కానీ వారికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. చిన్న […]
నెల నెల కొంత మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారికి ఎన్నో స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పీపీఎఫ్ నుంచి మెరుగైన రాబడులు పొందవచ్చు. నెల జీతం మీద ఆధారపడే ఉద్యోగులకు, నెల మొత్తం మీద కొంత మొత్తంలో పొదుపు చేయాలనుకునేవారికి పీపీఎఫ్ చాలా ఉత్తమం. ఇందులో ప్రతి నెలా కేవలం రూ.5000 డిపాజిట్ చేయడం […]
భవిష్యత్ లో పిల్లల జీవితం ఆనందంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అలా అన్ని సవ్యంగా జరగాలంటే చిన్న వయసులోనే పిల్లల పేరుపై పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. అంతేకాదు.. ఈ పెట్టుబడి వారి విద్యకు, వివాహానికి అన్నింటికీ భరోసాగా ఉంటుంది. అయితే ఏ పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందో తెలుసుకుందాం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). పీపీఎఫ్ లో ఖాతా తెరిచి నెల నెలా […]
బిజినెస్ డెస్క్- డబ్బు.. ఈ ప్రపంచంలో అన్నింటికీ మూలం డబ్బే అని చెప్పక తప్పదు. మారుతున్న కాలంలో ఏం కావాలన్నా అందుకు డబ్బు కావాల్సిందే. డబ్బు లేనిదే జీవితంలో ఒక్క క్షణం కూడా ముందుకు వెళ్లదు. అందుకే కలికాలం డబ్బు మయం అన్నారు. మరి డబ్బు ఎంత సంపాదించినా అది పిల్లల కోసమే కదా. తల్లిదండ్రులు తమ జీవితాన్నంతా పిల్లల కోసమే ధారపోస్తారు. కష్టపడి సంపాదించి పిల్లల భవిష్యత్తు కోసం కూడబెడతారు. ఐతే మనం చిన్న చిన్న […]