రాకేష్ మాస్టర్ మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన ఇక లేరనే వార్తను విని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ టైమ్‌లో రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదేంటో తెలిస్తే వారికి సెల్యూట్ చేయకుండా ఉండలేరు.
నేటి సమాజంలో ఎవరి లైఫ్ వారిదే అన్నట్టుగా సాగిపోతున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నవారిని ఎంతోమంది చూస్తున్నాం. కానీ కొంతమంది మాత్రం తాము చనిపోతూ పదిమందిని బతికిస్తున్నారు.
మరణించిన వారి జ్ఞాపకాలు మిగిలివుండాలంటే.. సరైన మార్గం.. అవయవదానం. ఇలా చేయడం వల్ల జ్ణాపకాలు మిగిలిపోవడంతో పాటు మరో నలుగురికి పునర్జన్మను ప్రసాదించవచ్చు. రోడ్డు ప్రమాదాల బారిన పడి నిత్యం ఎంతో మంది మరణిస్తున్నారు .వీరిలో కనీసం పది వంతైనా అవయవదానానికి అంగీకరిస్తే.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న మరొకరికి ప్రాణం పోయొచ్చు.
అవయవదానం గురించి ఎంత అవగాహన కల్పిస్తున్నా కూడా ఆర్గాన్ డోనేషన్ కి ఎవ్వరూ ముందుకు రారు. ఇప్పటికీ గుండె కానీ, కిడ్నీ కానీ మార్చాలంటే.. సదరు బాధితులు ఆస్తులు అమ్ముకోవాల్సిందే. పోనీ ఆస్తులు అమ్ముకుంటామన్నా.. అవి దొరికే పరిస్థితులు చాలా అరుదు. దీంతో అవయవాలు దొరక్క, ఆపరేషన్ చేయించుకోలేక అనేక మంది చనిపోయిన వారున్నారు. వారిలో ఒకరు నటి మీనా భర్త విద్యాసాగర్. ఆయనకు లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి అనారోగ్యం బారిన పడ్డారు. ఊపిరితిత్తులు మార్చాలని డాక్టర్లు […]
కన్నబిడ్డను కడుపులో పెట్టి చూసుకున్నారు.. అల్లారుముద్దుగా పెంచారు. బిడ్డను బాగా చదివించి.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయాలని ఎన్నో కలలు కన్నారు. నిత్యం బిడ్డ భవిష్యత్తు గురించే ఆలోచించేవారు. పైచదువులు ఎక్కడ చదివించాలి.. తన ఫ్యూచర్‌కు ఏ కోర్స్ బాగుంటుంది వంటి అంశాల గురించి చర్చించుకునేవారు. ఈ ఏడాది పదో తరగతి.. చదువుతోంది. తర్వాత ఏం చేయాలి అని నిత్యం బిడ్డ బాగోగుల గురించే ఆలోచించే ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలే విషాదం చోటు చేసుకుంది. […]
తెలుగులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆరేళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మీనా.. దాదాపు అందరు స్టార్ హీరోలతో 90కు పైగా సినిమాల్లో నటించింది. ఇటీవల భర్త విద్యాసాగర్ మృతితో పుట్టెడు దుఃఖంలో ఉంది. ఇలాంటి సమయంలో మీనా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అందరినీ అదే దారిలో నడవాలంటూ చైతన్యం కలిగిస్తోంది. మీనా భర్త అనారోగ్యంతో కాలం చేసిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల సంబంధిత కారణాలతో మరణించినట్లు […]
హైదరాబాద్ : అవయవదానం ప్రాణదానంతో సమానమని తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. రవీంద్రభారతిలో శనివారం జరిగిన జీవన్‌ధన్ 11వ దాతల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అవయవదానం గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అవయవదానం చేసిన వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. అవయవదానం చేసి మరొకరికి పునర్జన్మ నిచ్చిన […]