సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. కూలి పనులు, వ్యవసాయ పనులు చేసుకునే కుటుంబాలకు చెందిన వారు. తమలా తమ పిల్లలు కష్టపడకూడదని కష్టమైనా సరే ఉన్నత చదువులు చదివించారు. ఉద్యోగం కోసం నగరానికి పంపించారు. చేతికంది వచ్చిన పిల్లలను చూసి మురిసిపోయేలోపు తండ్రుల చేతులతో తలకొరివి పెట్టే పరిస్థితి వచ్చింది. పొలం దున్ని, కూలి పనులు చేసి, అప్పు చేసి లక్షలాది రూపాయలు క్యూనెట్ లో ఉద్యోగం అంటే పెట్టుబడి పెట్టామని లబోదిబోమంటున్నారు మృతుల తల్లిదండ్రులు.
ఖమ్మం- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పదవ తరగతి విద్యార్ధి చేయకూడని విన్నపం చేశాడు. తనకు బ్రతకాలని లేదని, చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరాడు. ఈ మేరకు మీడియా ద్వార టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేయడం కలకలం రేపుతోంది. తన అక్క, బావ మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని, వారి వేధింపులు తట్టుకోవడం కంటే చావే నయం అనిపిస్తోందని వాపోయాడు. ఖమ్మం […]