హీరోలకు, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేయడం చూసి ఉంటారు. కానీ పోలీసులకు పాలాభిషేకం చేయడం అనేది చాలా అరుదు. కానీ రైతు దంపతులు ఒక పోలీస్ అధికారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సాధారణంగా చాలా మంది జీవితంలో సుఖంగా బతికితే చాలు అనే భావనలో ఉంటారు. కానీ కొందరు మాత్రం చరిత్రలో తమపేరు నిలిచిపోయేలా ఏదైనా సాధించాలనే కసితో జీవిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఎన్నో అవరోధాలు దాటుకుని అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. అయితే ఇలా తాము అనుకున్న లక్ష్యాలు సాధించటంతో పాటు అరుదైన ఘనతలు సొంతం చేసుకుంటారు కొందరు. తాము చదువుకున్న పాఠశాలకే టీచర్ గా వెళ్లడం, తమ మండలానికి అధికారిగా ఉద్యోగం రావడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి […]
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీ స్థాపించి రాష్ట్రంలో అధికార పార్టీ పనితీరుపై ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై విమర్శలు చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు ఈ క్రమంలో రాళ్లదాడికి పాల్పడ్డారు.. అంతేకాదు షర్మిల క్యారవాన్‌కు నిప్పు పెట్టడంతో పరిస్థితి రణరంగంగా మారింది. […]
ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వలేదని రుణదాత సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది క్రితం అప్పు తీసుకున్న వ్యక్తి వద్దకు రుణదాత చెప్పులు అరిగేలా తిరుగుతున్నా.. అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకుండా రోజులను దాటవేస్తూ తప్పించుకున్నాడు. దీంతో ఆ రుణదాత అనేక సార్లు పంచాయితి పెట్టించి న్యాయం కోసం వేచి చూసింది. కానీ రుణదాతకు అన్యాయమే జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అప్పు ఇచ్చిన వ్యక్తి చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. […]