దర్శకుడిగా రాజమౌళి పేరు ప్రపంచానికి తెలిసినప్పటికీ.. ఆయన ఫ్యామిలీలో చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారని తెలుగువారికి మాత్రమే తెలుసు. ఎంఎం కీరవాణి, రమా రాజమౌళి, శ్రీవల్లి, కార్తికేయ, విజయేంద్రప్రసాద్.. ఇలా వీరందరి పేర్లు రెగ్యులర్ గా వినిపిస్తుంటాయి. వీరి ఫ్యామిలీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ పేరు తక్కువగా వింటుంటాం. కానీ.. శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకుంది.
ఉరికే ఉరికే మనసే ఉరికే అంటూ హిట్ 2 సినిమాలో తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించారు ఎం ఎం శ్రీలేఖ. అప్పడే ఆమె సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్లు పూర్తయింది. నాన్నగారు సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం ద్విగ్విజయంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.
ఫిల్మ్ డెస్క్- ఎస్ ఎస్ రాజమౌళి.. ఈ దర్శకధీరుడి డైరెక్షన్ లో నటించాలని స్టార్ హీరోలు, నటీ నటులు ఉవ్విళ్లూరుతుంటారు. కనీసం ఒక్క సినిమాలోనైనా ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటారు. ఇక అభిమానులైతే తమ అభిమాన హీరో, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రావాలని అడుగుతుంటారు. ఇదిగో ఇటువంటి సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా అంటే ఇక చెప్పేదేముంది. రాజమౌళి, మహేష్ బాబు సినిమాపై అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. […]