నిరుపేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చింది. బాలలు కార్మికులుగా మారడాన్ని తగ్గించేందుకు బడిలోనే ఒక పూట భోజనం పెట్టడంతో.. విద్యా బుద్ధులు నేర్చుకునే అవకాశం లభించినట్లయింది. అయితే ఈ పథకం పలుమార్లు విమర్శలు వస్తున్నప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ కారణంగా ఈ మెనూలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత పరిమాణాలు పాటించడంలేదని ఫిర్యాదులు వస్తున్నా.. సిబ్బందిలో మాత్రం మార్పుడు రావడం లేదు.
ఇప్పటికే పెరుగుతున్న ఎండలు దృష్ట్యా తెలంగాణ సర్కార్ ఒంటి పూట బడులు ప్రకటించింది. ఇవి మొదలయ్యి పది రోజులు కూడా గడిపోయాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో వీటిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. దీంతో తల్లిదండ్రులు సైతం సందిగ్థంలో ఉన్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా స్పందించారు.
ఏపీలో విద్యార్థులకు సీఎం జగన్ మరో శుభవార్త చెప్పారు. ఇప్పటి వరకూ ప్రతీ పేద విద్యార్థి చదువుకోవాలన్న ఆకాంక్షతో బడికి రప్పించేలా అమ్మఒడి పేరుతో రూ. 15 వేలు తల్లులు ఖాతాల్లో వేసుకొచ్చిన జగన్.. మరోసారి విద్యార్థుల కోసం ఆలోచిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మధ్యాహ్న భోజన పథకం ఎంతో మంది పేద విద్యార్థులకు వరం. కానీ అదే భోజనం.. తమకు శాపంగా మారుతుందని ఆ విద్యార్థులు ఊహించలేదు. రోజులానే ఆహారాన్ని తిన్న విద్యార్థులు.. ఒక్కొక్కరిగా అనారోగ్యానికి గురయ్యారు. తమకు ఏం జరిగిందో తెలియని అనిశ్చిత స్థితికి చేరుకున్నారు. వారి పరిస్థితిని చూసిన స్కూల్ యాజమన్యం కూడా .. ఒక్కసారిగా ఖంగుతింది. హుటా హూటిన సమీపంలోని ఆసుప్రతికి తరలించింది. అయితే వీరు తిన్న ఆహారంలో పాము ఉన్నట్లు వండిన వ్యక్తి గుర్తించడంతో.. ఒక్కసారిగా […]
నేడు సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. చాలా మంది టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రపంచంలోని ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనిషి.. తనకు తెలియని ఎన్నో విషయాలను కనిపెడుతున్నాడు. ఎన్నో అంతుచిక్కని రహస్యాలను సైతం చేధిస్తున్నాడు. ఇంతలా విజ్ఞానంతో దూసుకెళ్తున్న ఈ సమాజంలో ఇంకా కొందరు మూఢనమ్మకాలను వదలటం లేదు. మరీ దారుణం ఏమిటంటే మూఢనమ్మకాలను విశ్వసించ వద్దని విద్యార్ధులకు చెప్పాల్సిన గురువులే.. వాటిని బలంగా నమ్ముతున్నారు. వారు నమ్మడమే కాక ఆ […]
ఇటీవల సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కస్తూరీ బా పాఠశాలకు చెందిన 35 పిల్లలు అల్పహారం తిని అస్వస్థత గురైన సంగతి తెలిసిందే. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పికి తాళలేక పిల్లలు అల్లాడిపోయారు. ఇలాంటి ఘటనలు తరచూ అక్కడకక్కడ జరుగుతూనే ఉంటాయి. తాజాగా మధ్యాహ్న భోజనం చేసిన 200 మంది విద్యార్ధులు అస్వస్థకు గురయ్యారు. బల్లి పడినట్లు అనుమానిస్తున్న భోజనాన్ని ఉపాధ్యాయులు బలవంతగా తినిపించడంతో విద్యార్ధులు అస్వస్థకు గురైనట్లు సమాచారం. ఈ ఘటన బీహార్ లోని […]
Video Viral: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యాహ్న భోజన పథకం ఎంతో మంది పేద పిల్లల ఆకలి తీరుస్తోంది. ఇంట్లో తినడానికి సరిగా తిండి లేని ఎంతో మంది పిల్లలు స్కూలుకు వెళ్లి కడుపు నింపుకుంటున్నారు. నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. అయితే, కొన్ని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటోంది. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు, చారులాంటి పప్పు పిల్లలకు ఆహారంగా మారుతోంది. కొన్ని స్కూళ్లలో […]