తమిళ చిత్రసీమకు సేవలు అందించిన అతికొద్ది బహుముఖ ప్రజ్ఞాశాలుల్లో మనోబాల ఒకరు. డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, యాక్టర్‌గా ఆయన కళామతల్లికి సేవలు అందించారు. వైవిధ్యమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు కన్నుమూస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్ తో కోట్ల మంది అభిమానులను అలరించిన నటుడు కన్నుమూశారు.. నటుడిగానే కాకుండా స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు.