దేశంలోని అందరు ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆస్తులు, క్రిమినల్ కేసులు, గన్ లైసెన్సులు, వ్యక్తిగత వాహనాలు, స్థిరాస్తులు ఇలా మొత్తం 7 అంశాలతో ఒక నివేదిక విడుదలైంది. ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ ది ప్రింట్ ఈ నివేదికను సిద్ధం చేసింది. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ వివరాలు అన్నీ ముఖ్యమంత్రులు సమర్పించే అఫిడవిట్ల ఆధారంగా తయారు చేసినట్లు తెలిపారు. ది ప్రిట్ పత్రిక నివేదిక ప్రకారం.. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా జగన్ […]
కోల్ కత్తా- పశ్చిమ బెంగాల్ లోని భవానీపూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీ పూర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మొన్న జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓటమిపాలైంది. బీజేపీ అభ్యర్ధి, ప్రస్తుత ప్రతిపక్ష నాయుకుడు సువేందు అధికారి చేతిలో మమత ఓడిపోయింది. కేవలం1959 ఓట్ల తేడా మాత్రమే ఉండటంతో మమతా బెనర్జీ కోర్టులో ఫలితాన్ని […]
కోల్ కత్తా- దేశ ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరగంట పాటు వెయిట్ చేయించారన్న వార్త బాగా వైరల్ అయ్యింది. దీంతో ప్రధానిని అలా తన కోసం ఎదురుచూసేలా చేయడం సరికాదని దీదీపై విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయంగా విభేదాలున్నా.. అధికారిక కార్యక్రమాల్లో ఇలా ప్రధానిని అవమానించడం సమంజసం కాదని చాలా మంది కామెంట్స్ చేశారు. దీంతో మరోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ వేడి […]
కోల్ కత్తా- మమతా బెనర్జీ.. అలియాస్ దీదీ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. మొన్న జరిగిన ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యారు మమత. ఈ సారి దీదీని ఓడించి, బెంగాల్ లో పాగా వేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా శతవిధాలుగా ప్రయత్నించినా వారి పాచికలు పారలేదు. బీజేపీ పార్టీ ఎన్ని ప్రయోగాలు చేసినా బెంగాల్ ప్రజలు మాత్రం మళ్లీ మమతకే పట్టం కట్టారు. దీంతో దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ సత్తా ఎంటో మరోసారి నిరూపితమైంది. ఇక […]
కోల్‌కతా (నేషనల్ డెస్క్)- తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మూడోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని రాజ్ భవన్‌లో గవర్నర్ జగదీప్ ధన్‌కర్ దీదీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సాధారణంగా జరిగింది. మమతా బెనర్జీ బెంగాలీలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు మందు టీఎంసీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశానికి మమత బెనర్జీ హాజరయ్యారు. ఇక […]
పొలిటికల్ డెస్క్- వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో దీదీ ముచ్చటగా మూడోసారి సీఎం పదవి చేపట్టబోతోంది. ఐతే ఈ సమయంలో 1980ల నాటి మమత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా కూడా మమతపై ప్రశంసలు కురిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి ఆమె విజయం సాధించినందుకు పార్టీలకు అతీతంగా అభినందనలతో ముంచెత్తుతున్నారు. ట్విట్టర్‌లో 1980ల నాటి మమతా బెనర్జీ బ్లాక్ […]
టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. సోమవారం (ఇవాళ) తృణమూల్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే మమతను శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఈ నెల 5 న ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేస్తారని తృణమూల్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రమాఫ స్వీకార మహోత్సవాన్ని అత్యంత సాధారణంగానే జరుపుతామని ప్రకటించారు. కరోనాను కట్టడి చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని, దానిని కట్టడి చేసేంత […]
కోల్ కతా (నేషనల్ డెస్క్)- పశ్చిమ బెంగాల్ లో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితం ముందు నుంచి ఉత్కంఠ రేపింది. కానీ చివరకు బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారి విజయం సాధించారు. తొలుత 1200 ఓట్లతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గెలిచారని ప్రచారం జరిగింది. అయితే చివరికి సుబేందు 1,622 పైగా ఓట్లతో గెలుపొందారని తేలింది. అయితే ఓట్ల లెక్కింపులో ఏర్పడిన గందరగోళం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. సుబేందు అధికారి గెలుపును […]