ఆర్థిక ఇబ్బందులు మనుషుల్ని, బంధాల్ని, బంధుత్వాలను కుంగదీస్తాయి. ఇవే సమస్యలు ప్రాణాల మీదకు తెస్తాయి. జీతం కన్నా ఖర్చులు పెరగడం, వేటిని ఆపలేని పరిస్థితుల్లో అప్పులు చేసి, వాటిలో కూరుకుపోయి.. తీర్చలేక అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.
నవమాసాలు మోసి కన్న తల్లికి అన్నం పెట్టడానికి కొడుకులకు మనసు రాలేదు. రెండు నెలలుగా ఇదే తంతు. దీంతో ఆ తల్లి భిక్షాటన చేసుకుని కడుపు నింపుకుంది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
జీవితంలో ఓ ఇల్లైనా కట్టుకోవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. తమ స్థోమతకు తగ్గట్లు ఇళ్లను నిర్మించుకోవాలనుకుంటారు. కాస్తంత భూమి ఉంటే చాలు.. దానికి తగ్గట్లుగా పెంకిటిల్లు,రేకిలిల్లు, చిన్న డాబా అయినా వేసుకుందామనుకుంటారు. అయితే మహబూబాబాద్ కు చెందిన ఓ ఇద్దరు తమ తల్లిదండ్రులకు ఓ ఇళ్లును బహుమతిగా ఇద్దామని భావించారు. అందరిలా కాకుండా.. వినూత్నంగా ఆలోచించి కంటైనర్ హౌస్ ను తయారు చేయించి.. తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రానికి చెందిన హుస్సేన్ […]
జ్వరం వస్తే ఎవ్వరైనా సరే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. జ్వరమనే కాదు ఆరోగ్యం బాగోకపోతే వైద్యులను కలవడం మామూలే. వాళ్లు ఇచ్చే సూదులు, మాత్రలతో తిరిగి కోలుకుంటారు. అయితే కొందరు మాత్రం అనారోగ్యంగా ఉంటే డాక్టర్లను కాకుండా మూఢ నమ్మకాలను ఆచరిస్తుంటారు. అప్పటికీ తక్కువ కాకపోతే ఆర్ఎంపీ డాక్టర్‌ను కలిసి వైద్యం చేయించుకుంటారు. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు పెద్దాసుపత్రికి వెళ్తారు. అప్పటివరకు కోడిగుడ్లు, నిమ్మకాయలు, మూడు బజార్ల వైద్యం అంటూ లేనిపోని నమ్మకాలతో కాలం వృథా చేస్తారు. […]
వైద్యమే.. వ్యాపారంగా సాగుతున్న రోజులివి. తుమ్ము వచ్చింది అని ఆస్పత్రికి వెళ్తే.. లేని రోగం మరొకటి అంటగట్టి పంపిస్తారు. వాళ్ళ వ్యాపారం కోసం డాక్టర్లు ఎంతకైనా తెగించేస్తారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి 18 ఏళ్ళ క్రితమే ఠాగూర్ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో వైద్యం కోసం వచ్చిన వ్యక్తికి చికిత్స అందించడంలో డాక్టర్లు చేసే హడావుడి అంతా, ఇంతా కాదు. పక్కపక్కనున్న రూంల్లోకి బుర్రున తిరుగుతూ.. వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ.. మొత్తానికి మనిషేమో చెంపేస్తారు. అచ్చం […]
పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తి వచ్చాడు. చేతిలో కాగితం పట్టుకుని రావడంతో ఫిర్యాదు చేయడానికి వచ్చారని పోలీసులు భావించారు. పీఎస్ కు వచ్చిన సదరు వ్యక్తి కూడా తన చేతిలో ఉన్న ఫిర్యాదు కాపీని అక్కడున్న పోలీసులకు ఇచ్చాడు. ఆ వృద్దుడు ఇచ్చిన ఫిర్యాదు అందుకొని షాక్ అయ్యారు పోలీసులు. సదరు వ్యక్తి మనుషులపై కాకుండా ఓ కుక్కపై చర్యలు తీసుకోవాలని.. తనను అది చిత్ర వద చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన మహబూబ్ […]