పైకి వెళ్తున్న లిఫ్ట్, వైరు తెగిపడటంతో వాయువేగంతో కిందకు వచ్చి పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు..
ఆస్పత్రిలో లిఫ్ట్ కుప్పకూలిన ఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ పరిధిలోని నల్లచెరువులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రి వార్షికోత్సవానికి వెళ్లారు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. ఇక అనుకున్న సమయానికి ఎమ్మెల్యేతో పాటు బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ నేతలు తదితరులు హాజరయ్యారు. ఇక ఆ ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తు ఎక్కేందుకు అంతా సిద్దమయ్యారు. అనుకున్నట్లుగానే లిఫ్ట్ సాయంతో వెళ్లాలని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మేయర్ సామల […]