క్రికెట్‌ను అభిమానించే ఎందరికో మహేంద్ర సింగ్ ధోని ఫేవరెట్ క్రికెటర్. అంతెందుకు చాలా మంది క్రికెటర్లు అతడ్ని ఆరాధిస్తారు. అలాంటి ధోని పేరును బ్యాట్ పైకి రాసుకుని గ్రౌండ్లోకి దిగిందో బ్యాటర్. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఐపీఎల్ 2022తో పాటు ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ లీగ్ 2022 కూడా జరుగుతున్న విషయంలో తెలిసిందే. ఈ లీగ్‌లో మూడు జట్లు పాల్గొంటున్నాయి. మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌తో ఒక మట్టిలోని మాణిక్యం బయటికి వచ్చింది. అచ్చం కరేబియన్ వీరుడు పొలార్డ్ లాంటి హిట్టింగ్‌తో బౌలర్ల పని పట్టింది. గురువారం వెలోసిటీ-ట్రయల్ బ్లేజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కిరణ్ నవ్గిరె విధ్వంసం సృష్టించింది. కేవలం 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సులతో సాయంతో 69 […]